Categories: TOP STORIES

ఆదిత్యా వాంటేజీ ప్రాజెక్టును మూసీలో క‌డుతున్నారా? లేదా?

  • సీఎం రేవంత్ రెడ్డికి పర్యావరణవేత్త
    డాక్టర్ లుబ్నా సర్వత్ లేఖ

మూసీ నదీ పరీవాహక ప్రాంతం వెంబ‌డి జరుగుతున్న ఆక్రమణలపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ మరోసారి గళమెత్తారు. వెంటనే ఆ ఆక్రమణలు, పారిశ్రామిక కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మూసీ పునరుద్ధరణకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ, సంబంధిత అధికారులు.. ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీ) సరిగా వ్యవహరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిత్య హోమ్స్ చేపట్టిన వాంటేజ్‌ ప్రాజెక్టే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు.

గూగుల్ ఎర్త్, ఎన్ఆర్ఎస్ సీ మ్యాపుల్లో పొందుపరిచిన అధికారిక కేఎంఎల్ డేటా ప్రకారం చూస్తే.. ఇది మూసీ నది ఒడ్డున నేరుగా కడుతున్న ప్రాజెక్టుగా తెలుస్తోందని.. దీనిని తక్షణమే అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీని పునరుద్ధరించడం గురించి తీవ్రంగా ఆలోచిస్తే.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కూడా ఆక్రమణలను తొలగించాల‌ని అన్నారు. ఆక్రమణలపై గతంలో చేసిన వినతులతో పాటు గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీన రాసిన లేఖలోని అంశాలను కూడా తాజా లేఖలో ఆమె మరోసారి ప్రస్తావించారు. ఆయా అంశాలపై ఇంకా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆధారాల్ని సమర్పించారు.

This website uses cookies.