కోఆపరేటివ్ సొసైటీలు నెలకు రూ7,500 కంటే అధిక నిర్వహణ రుసుము (మెయింటనెన్స్ ఫీజు) వసూలు చేస్తే.. దానిపై 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని మహారాష్ట్ర అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ బెంచ్ ఇటీవల వెల్లడించింది. ఈ నిబంధన 2017 జులై 1 నుంచి అమలు అవుతుందన్నారు. ఇది తమ మొదటి తీర్పు అని సవరణనను పోస్ట్ చేయాలని తెలియజేసింది. కాకపోతే, వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల కంటే తక్కువ చిన్న సొసైటీలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జీఎస్టీకి సంబంధించిన ఎలాంటి నిబంధనల్ని పాటించక్కర్లేదని తెలియజేసింది.