poulomi avante poulomi avante

భారీగా పెరిగిన నిర్మాణ వ్య‌యం..

3ఏళ్లలో 35 శాతం పెరిగిన కన్ స్ట్రక్షన్ కాస్ట్

భవన నిర్మాణ కార్మికుడి రోజు కూలీ 1200

3ఏళ్లలో 18 శాతం పెరిగిన సిమెంట్ ధర

మార్కెట్ లో 47 శాతం పెరిగిన స్టీల్ ధర

రియల్ ఎస్టేట్ లో నిర్మాణ వ్యయం అంతకంతకు పెరుగుతోంది. గడిచిన మూడేళ్లలో సుమారు 35 శాతం మేర కన్ స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. భవన నిర్మాణ కూలీల నుంచి మొదలు స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఆ ప్రభావం ఇళ్ల ధరలపై పడుతోంది. ఐతే ఇళ్ల ధరలు పెరగడమే కాని తగ్గడం ఉండదు కాబట్టి ఇంటి కొనుగోలు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

సొంతిళ్లు కట్టుకోవాలని, లేదంటే కొనుక్కోవాలని ప్ర‌తి ఒక్క‌రూ ఆశపడుతున్నారు. అంతే కాదు ఆమేరకు ఇళ్లు కట్టుకోవడానికో, లేదంటే కట్టిన ఇళ్లు, అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుక్కునేందుకో ప్రయత్నిస్తున్నారు. ఐతే సామాన్య, మధ్య తరగతి వారు ఇళ్లు కొనుక్కునే అవకాశాలు మెల్ల మెల్లగా సన్నగిల్లుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఇళ్ల ధరలు పెరగడమే.

భూముల విలువ పెరగడంతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో క్రమంగా గృహాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గడిచిన మూడేళ్లలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. కార్మికుల కూలీ నుంటి మొదలు సిమెంట్‌, స్టీల్‌, కాంక్రీట్‌, అల్యూమినియం, కాపర్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం సగటున మూడేళ్లలో 35 శాతం పైగా పెరిగిందని నిర్మాణదారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ వంటి మెట్రో నగరాల్లో నైపుణ్యం కలిగిన నిర్మాణ కూలీలకు ఇచ్చే రోజువారీ సగటు కూలి 1200 రూపాయలు. నైపుణ్యం లేని వారికి 900 రూపాయలు ఇస్తున్నారు. ఇక కీలకమైన స్టీల్, సిమెంట్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. నిర్మాణంలో కీలకమైన సిమెంట్‌ ధరలు మూడేళ్లలో 18 శాతం పెరిగాయి.

ఒక దశలో పెరుగుదల గరిష్ఠంగా 39 శాతం వరకు వెళ్లిన సందర్బాలు ఉన్నాయి. గత ఏడాది చివర్లో కొంతమేర ధరలు తగ్గడంతో నిర్మాణం రంగం ఊపిరి పీల్చుకుంది. 53 గ్రేడ్‌ సిమెంట్‌ మెట్రిక్‌ టన్నుకు 2020 ప్రారంభంలో 5,120 ఉంటే 2021 నాటికి 7100 చేరి 2022 ఆఖరుకు 5,960కి తగ్గింది. ప్రస్తుతం మార్కెట్ లో 50 కేజీల సిమెంట్ బస్తా కంపెనీని బట్టి 270 రూపాయల నుంచి 410 రూపాయల ధరలున్నాయి.

ఇక స్టీల్‌ ధరలు మూడేళ్లలో భారీగా పెరిగాయి. మూడేళ్ల క్రితం టన్ను 42,480 ఉన్న రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ స్టీల్‌ ఏకంగా 43 శాతం పెరిగి గత ఏడాది ఆఖరు నాటికి 60 వేల రూపాయలకు చేరింది. ప్రస్తుతం మార్కెట్ లో కంపెనీని బట్టి టన్ను స్టీల్ 62 వేల నుంచి 72 వేల రూపాయల వరకు ధరలున్నాయి. హైరైజ్ అపార్ట్ మెంట్స్ ట్రెండ్ వచ్చాక కాంక్రీట్‌ వినియోగం బాగా పెరిగింది. ఎం25, ఎం30, ఎం35 గ్రేడ్‌ రకం కాంక్రీట్‌ ధరలు 2020 లో ఒక క్యూబిక్‌ మీటర్‌కు 5012 రూపాయలుగా ఉండేది.

కానీ ప్రస్తుతం కాంక్రీట్ ఒక క్యూబిక్ మీటరు 5,650 రూపాయలకు చేరింది. నిర్మాణాల్లో అల్యుమినియం, కాపర్‌ వినియోగం కూడా ఎక్కువే. భవన నిర్మాణానికి సంబందించి ఎలక్ట్రికల్‌లో ఇవి చాలా కీలకం. మార్కెట్ లో ప్రస్తుతం వీటి ధరలు భారీగా పెరిగాయి. అల్యూమినియం ధరలు 2020తో పోలిస్తే 2023 ఆఖరు నాటికి 46 శాతం ధరలు పెరిగాయి. ఇప్పుడు మెట్రిక్‌ టన్ను అల్యూమినియం 1.86 లక్షల రూపాయలుగా ఉంది.

మరో వైపు నిర్మాణరంగంలో ఇంధన ధరల పెరుగుదల పరోక్షంగా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమవుతోందని జేఎల్ఎల్ నివేదిక చెబుతోంది. సిమెంట్‌, స్టీల్‌, కాంక్రీట్‌, ఇసుక, ఇటుకల వంటి నిర్మాణ సామగ్రి వేరేచోట తయారై నిర్మాణ స్థలానికి చేరుకుంటాయి. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతుంది. గడిచిన మూడేళ్లలో డీజిల్ ధర 32 శాతం మేర పెరిగింది. దీంతో నిర్మాణ సామగ్రి రవాణా ఖర్చులు పెరిగి ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతోంది.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల ఇళ్ల నుంచి మొదలు ఆకాశాన్నంటే హైరైజ్ అపార్ట్ మెంట్స్ వరకు నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఆకాశహర్మ్యాలను 30 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మిస్తున్నట్లయితే నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 5,300 నుంచి 6,300 వరకు అవుతోందని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. నాణ్యంగా, ప్రీమియంగా కట్టే ప్రాజెక్టులలో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.

పదిహేను అంతస్తులపైన కట్టే వాటిలో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 3,800 నుంచి 4,500 అవుతుంది. 5 నుంచి 12 అంతస్తుల లోపు కట్టే భవనాల్లో చదరపు అడుగుకు 2,900 నుంచి 3,300 వ్యయం అవుతుంది. అందుబాటు ఇళ్ల నిర్మాణంలో స్టాండ్ లోన్‌ అపార్ట్‌మెంట్లు ఐదు అంతస్తుల వరకు ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి సగటున 2,200 నుంచి 2,600 ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక విల్లాల్లో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తుల వరకు చదరపు అడుగుకు 4,300 నుంచి ప్రాజెక్టును బట్టి 12 వేల వ్యయం అవుతుంది. వాణిజ్య ఆకాశహర్మ్యాల నిర్మాణ వ్యయం గృహ నిర్మాణంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ చదరపు అడుగు 4,100 నుంచి 4,800 వరకు ఖర్చవుతోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles