ఎల్బీ నగర్ లో వాసవీ ఆనంద నిలయం
ఎల్బీ నగర్ మెట్రో పక్కనే ఈ ప్రాజెక్టు
29.37 ఎకరాల విస్తీర్ణం.. 3,576 ఫ్లాట్స్
వాసవీ ఆనంద నిలయంలో 112 స్కై విల్లాలు
రెండు అత్యాధునిక క్లబ్ హౌజ్ లు
హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు మూడు దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్.. ఈస్ట్ హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ మెయిన్ రోడ్డు మీద నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టే.. వాసవి ఆనంద నిలయం. ఇది సౌత్ ఇండియాలోనే అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అనే విషయం మీకు తెలుసా. ఇందులో దాదాపు వందకు పైగా ప్రపంచ స్థాయి సదుపాయాల్ని వాసవి సంస్థ పొందుపరుస్తోంది.
ఇందులో నిర్మాణం వచ్చేది కేవలం 28 శాతం స్థలంలోనే. సుమారు 29.37 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో సుమారు 3576 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. మరి, ఈస్ట్ హైదరాబాద్‌కే సరికొత్త అందన్ని తెచ్చేలా రూపుదిద్దుకుంటున్న వాసవి ఆనంద నిలయంపై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ స్టోరీని చూసేద్దామా..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అందులోను నిర్మాణ రంగంలో వాసవీ గ్రూప్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. నమ్మకానికి, నాణ్యమైన నిర్మాణాలకు వాసవీ గ్రూప్ పెట్టింది పేరు. సుమారు 30 ఏళ్లకు పైగా హైదరాబాద్ లో నివాస, వాణిజ్య నిర్మాణాలను చేపడుతున్న వాసవీ గ్రూప్ నగరంలో పలు ప్రాజెక్టులను చేపట్టింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎల్బీ నగర్ లోని వాసవి ఆనంద నిలయం గురించి. నగరం నడిబొడ్డున, ప్రధాన రహదారిపైన, అదీ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కన వాసవీ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఆనంద నిలయం.
ఇది సౌత్ ఇండియాలోనే అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు అని చెప్పవచ్చు. మొత్తం 29.37 ఎకరాల్లో నిర్మాణం జరుపుకుంటున్న వాసవీ ఆనంద నిలయంలో 3,576 ఫ్లాట్స్ వస్తున్నాయి. మొత్తం స్థలంలో కేవలం 28 శాతం మాత్రమే నిర్మాణం జరుపుకుంటుండగా, మిగతా 72 శాతం ఓపెన్ స్పేస్ వస్తుంది. దీంతో పచ్చదనానికి, గాలి వెలుతురుకు ఏ మాత్రం కొదవ ఉండదు. వాసవీ ఆనంద నిలయంలో అహ్లాదకరమైన వాతావరణంలో జీవనం గడపవచ్చు.
వాసవి ఆనంద నిలయంలో డబుల్, ట్రిపుల్, ఫోర్ బెడ్రూములతో పాటు.. సుమారు 112 స్కై విల్లాల్ని కూడా డిజైన్ చేశారు. 32, 33 అంతస్తుల్లోని స్కై విల్లాస్‌ని చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అనుకుంటే.. ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలని భావించేవారికి.. ఈ ప్రాజెక్టులోని స్కై విల్లాస్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
సుమారు 1.31 లక్షల చదరపు అడుగుల్లో డిజైన్ చేసిన రెండు క్లబ్ హౌజులు వేటికవే తమ ప్రత్యేకతను చాటిచెబుతాయని గుర్తుంచుకోండి. ఇందులోని లాప్ అండ్ రిక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవీలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, ఔట్ డోర్ డైనింగ్ స్పేస్ వంటి వాటితో రెసిడెంట్స్ ఎంతో సంతోషంగా గడపొచ్చని గుర్తుంచుకోండి.
ఎల్బీ నగర్ లోని వాసవి ఆనంద నిలయంలో 3,576 డబుల్, ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లతో పాటు సుమారు 112 స్కై విల్లాలు సైతం నిర్మాణం అవుతున్నాయి.32, 33 అంతస్తుల్లో వస్తున్న ఈ స్కై విల్లాలను చూస్తే ఔరా అనాల్సిందే. విశాలంగా, సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న స్కై విల్లాలు ఆనంద నిలయ ప్రాజెక్టుకే హైలెట్ అని చెప్పక తప్పదు.
ఇక వాసవీ ఆనంద నిలయం ప్రాజెక్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్లబ్ హౌజ్ ల గురించి. ఈ ప్రాజెక్టులో అత్యాధునిక సౌకర్యాలతో రెండు క్లబ్ హౌజ్ లు వస్తున్నాయి. సుమారు 1.31 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం జరుపుకుంటున్న క్లబ్ హౌజ్ లలో ప్రపంచ స్థాయిలో వందకు పైగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది వాసవీ సంస్థ.
స్విమ్మింగ్ పూల్స్ నుంచి మొదలు లాప్ అండ్ రిక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవీలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, ఔట్ డోర్ డైనింగ్ స్పేస్, గెస్ట్ రూమ్స్, అత్యాధునిక జిమ్, ఇండోర్ అండ్ అవుట్ డోర్ గేమ్స్ జోన్ వంటి ఎన్నో సౌకర్యాలను ఈ క్లబ్ హౌజ్ లలో ఏర్పాటు చేస్తున్నారు. ఈస్ట్ హైదరాబాద్ కే తలమానికమైన వాసవీ ఆనంద నిలయంలో ఫ్లాట్ తీసుకోవడమంటే స్టేటస్ సింబల్ లా భావిస్తున్నారు చాలా మంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే ఎల్బీ నగర్ లోని ఆనంద నిలయం ప్రాజెక్టుని సందర్శించి మీ ఇంటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోండి.