poulomi avante poulomi avante

జీహెచ్ఎంసీ కమీషనర్ అమ్రపాలి ఆగ్రహం

నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టాక డైనమిక్ గా పని చేస్తున్నారు ఐఏఎస్ అధికారి అమ్రపాలి. సమయం చిక్కినప్పుడల్లా నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పారిశుద్యానికి సంబంధించి పౌరుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన దృష్టికి వచ్చిన పార్కింగ్ అంశంపై జీహెచ్ఎంసీ కమీషనర్ సీరియస్ అయ్యారు. ఇటీవల ఆమ్రపాలి సిటీలోని కొన్ని థియేటర్స్, మల్టీప్లెక్స్ లను అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ లోని థియేటర్లలో అక్రమంగా కస్టమర్ల నుంచి పార్కింగ్ ఫీజు వసూళ్లు చేస్తున్నట్లు ఆమె గుర్తించారు.

సింగిల్ స్క్రీన్ కలిగిన కేటగిరీలో అనుమతి తీసుకుని మూడు, నాలుగు స్క్రీన్ లు నిర్వహిస్తున్నట్టు కమీషనర్ గుర్తించారు. ఆయా థియోటర్స్, మల్టీప్లెక్సుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇకపై ధియేటర్స్, మల్టీప్లెక్స్ ల్లో అక్రమంగా పార్కింగా ఫీజు వసూలు చేసినా, నాసిరకం ఆహార పదార్థాలు పెట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు, పెద్ద పెద్దా షాపింగ్ మాల్స్ లో తొలి 30 నిమిషాల పాటు ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని చెప్పారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles