poulomi avante poulomi avante

కొనుగోలుదారుల కోసం రెరా కీలక ఆదేశాలు

ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రెరా ఇటీవల కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆ మేరకు డెవలపర్లు, బిల్డర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అమ్మకపు ఒప్పందంలో పేర్కొన్న సౌకర్యాలన్నీ సిద్ధం చేసిన తర్వాతే ఫ్లాట్లను కొనుగోలుదారులకు అప్పగించాలని స్పష్టంచేసింది. సౌకర్యాలు కల్పించకుండా షరతులతో స్వాధీనం చేయొద్దని హెచ్చరించింది. యూపీ రెరా ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ఐదు అంశాలు ఇవీ..

క్యూఆర్ కోడ్ తప్పనిసరి

రియల్ ఎస్టేట్ మార్కెట్లో పారదర్శకతను ప్రోత్సహించే లక్ష్యంతో, రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి కొత్త ప్రాజెక్టుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయిస్తామని, ప్రమోటర్లు వాటిని తమ బ్రోచర్లు, ప్రకటనలలో తప్పనిసరిగా ప్రకటించాలని యూపీ రెరా సూచించింది. బుకింగ్ ఫారమ్‌లు, కేటాయింపు లేఖలు, బిల్డర్-కొనుగోలుదారు ఒప్పందాల వంటి అన్ని డాక్యుమెంట్‌లలో ప్రమోటర్లు ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్‌లను ప్రచురించాలని స్పష్టంచేసింది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రాజెక్టుకు సంబంధించిన సమస్త వివరాలూ వస్తాయని పేర్కొంది.

సౌకర్యాల కల్పన తర్వాతే స్వాధీనం

సేల్ అగ్రిమెంట్‌లో వాగ్దానం చేసిన సౌకర్యాలు సిద్ధమైన తర్వాత మాత్రమే హౌసింగ్ యూనిట్లను స్వాధీనం చేసుకోవాలని యూపీ రెరా రియల్టర్లకు నిర్దేశించింది. సేల్ అగ్రిమెంట్‌లో వాగ్దానం చేసిన సౌకర్యాలు, సేవలు సిద్ధంగా లేనప్పటికీ స్వాధీనం లేఖలపై సంతకం చేయమని బలవంతం చేస్తున్నారంటూ గృహ కొనుగోలుదారుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమ్మకపు ఒప్పందంలోని అన్ని అంశాలనూ పూర్తి చేసిన తర్వాతే ఫ్లాట్లను స్వాధీనం చేయాలని స్పష్టం చేసింది.

వివరాలు అప్ లోడ్ చేయకుంటే అబెయాన్స్ లిస్ట్ లోకి..

భూమి రికార్డులు లేదా మ్యాప్‌లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడంలో విఫలమైతే ఆయా ప్రాజెక్టులను ‘అబెయాన్స్ లిస్ట్’లో ఉంచుతామని యూపీ రెరా హెచ్చరించింది. యూపీ రెరాలో రిజిస్టర్ అయిన ప్రాజెక్టుల రికార్డులను పరిశీలిస్తే.. దాదాపు 400 ప్రాజెక్టుల ప్రమోటర్లు ప్రాజెక్టు మ్యాప్, భూమి యాజమాన్యానికి సంబంధించిన పత్రాలను లేదా వాటిలో కనీసం ఒకదానిని పోర్టల్ లో అప్ లోడ్ చేయలేదని తేలిందని పేర్కొంది. ఈ నేపపథ్యంలో అలాటీలను అప్రమత్తం చేయడానికి, ప్రమోటర్ల నుంచి మోసపోకుండా రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే క్రయవిక్రయాలు

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో అమ్మకాలు, కొనుగోళ్లు యూపీ రెరాలో రిజిస్టర్ చేసుకున్ ఏజెంట్ల ద్వారా మాత్రమే జరగాలని సంస్థ స్పష్టంచేసింది. తప్పుదోవ పట్టించే సమాచారం ఆధారంగా ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన ఫిర్యాదులతోపాటు ఏజెంట్ల ద్వారా గృహ కొనుగోలుదారులను మోసం చేయడం వంటి ఫిర్యాదుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రెగ్యులేటరీ అథారిటీ ఈ చర్య తీసుకుంది.

ఆగిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణ

రాష్ట్రంలో ఆగిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించాలని యూపీ రెరా యోచిస్తోంది. యూపీలో పలు కారణాల వల్ల దాదాపు 10వేల యూనిట్లతో కూడిన ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు, రుణదాతల ప్రయోజనాలు కాపాడేందుకు వాటిని పునరుద్ధరించాలని భావిస్తోంది. నిధులు స్వాహా చేయడం, రుణ ఎగవేతలు, ప్రమోటర్లు దివాలా తీయడం, ఆర్థిక అవకతవకలు వంటి వివిధ అంశాలకు సంబంధించి దాదాపు రూ.2వేల కోట్ల విలువైన 17 ప్రాజెక్టులను రెరా పరిశీలిస్తోంది. ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles