అద్దెలు తట్టుకోలేక దుబాయ్ నుంచి షార్జాకు పయనం
దుబాయ్.. భారతీయులు సహా ఎందరో విదేశీయులకు రెండో ఇల్లు ఉండే దేశం. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్ కు ఉన్న క్రేజే వేరు. కెరీర్ అవకాశాలు, అధిక జీతాలు, మంచి జీవన నాణ్యత, వెచ్చని వాతావరణం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకర్షిస్తున్నాయి. దీంతో అటు టూరిజం డెస్టిడేషన్ స్పాట్ గానూ ఉన్న ఈ ఎడారి దేశంలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక్కడ ఇల్లు కొనాలంటే భారీ మొత్తంలో వెచ్చించాల్సిందే. ఇక దుబాయ్ అద్దెల గురించి చెప్పక్కర్లేదు. స్డూడియో రూమ్ కావాలన్నా 9వేల నుంచి 10వేల ధీరమ్స్ వెచ్చించక తప్పదు. రానురాను అద్దెలు గుదిబండల్లా మారిపోవడంతో చాలామంది ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అలాంటివారందరికీ దుబాయ్ కు ఉత్తరాన ఉన్న పొరుగుదేశం షార్జా ఓ వరంలా మారింది.
దుబాయ్ లో అద్దెలు భరించలేని వారంతా షార్జా వైపు చూస్తున్నారు. షార్జాలోని కొన్ని ప్రాంతాల్లో విదేశీయులు ఆస్తి కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన చట్టాన్ని ఆమోదించిన రెండేళ్లలోనే చాలా మంది పెట్టుబడిదారులు అటువైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే డెవలపర్లు పదివేల ఇళ్లను నిర్మించే పనిలో ఉన్నారు. దుబాయ్ లో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరుగుతుండటంతో చాలామంది షార్జా వైపు వెళుతున్నట్టు గమనించామని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ కర్ పరిశోధన, సలహా విభాగం హెడ్ ప్రత్యూష గుర్రపు తెలిపారు. అక్కడ తక్కువ అద్దెలు, తక్కువ జీవన వ్యయాలు ఉన్నట్టు వివరించారు. తక్కువ పన్ను విధానం, అనుకూలమైన టైమ్ జోన్ కావడంతో చాలామంది బ్యాంకర్లు, లాయర్లు, ఇతర వైట్ కాలర్ వర్కర్లు ఇటీవల కాలంలో ఎమిరేట్స్ కు రావడం ప్రారంభించారు. ఫలితంగా ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది.
కరోనా తర్వాత ఎమిరేట్స్ లో ఇళ్ల విలువలు భారీగా పెరిగాయి. సింగిల్ ఫ్యామిలీ హోమ్ లు, విల్లాల అద్దెలు ఏకంగా 86 శాతం పెరిగాయి. దుబాయ్‌తో పోలిస్తే షార్జా చాలా కాలంగా అందుబాటు ధరలో గృహాలను అందిస్తోంది. ఇది లగ్జరీ హోటళ్లు, మెనిక్యూర్డ్ పార్కులు, ఇన్ఫినిటీ పూల్స్ చుట్టూ నిర్మించిన సహజమైన హౌసింగ్ డెవలప్‌మెంట్‌లతో కూడిన ఆకర్షణీయమైన మెట్రోపాలిస్‌గా అవతరించింది. అయితే, షార్జాలో ఉన్న ఇళ్లలో ఎక్కువభాగం పాత టవర్లోనే ఉన్నాయి. దుబాయ్ అందించే సౌకర్యాలలో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో షార్జా కూడా మారుతోంది. సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ కుమారుడు, షార్జా పాలక కుటుంబ సభ్యుడికి చెందిన అరాడా డెవలప్‌మెంట్స్ 9.5 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు నిర్మిస్తోంది.
అల్జాడా అని పేరు పెట్టిన ఈ ప్రాజెక్టులో దాదాపు 25వేల గృహాలతోపాటు రెస్టారెంట్లు, షాపులు, క్రీడా సౌకర్యాలు అతిపెద్ద స్కేట్ పార్కు ఉండనున్నాయి. దాదాపు 7వేల సంవత్సరాల క్రితమే స్థిరపడిన షార్జాను.. 1600 నుంచి అల్ ఖాసిమి రాజవంశం పాలిస్తోంది. ప్రస్తుత రాజు దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా పరిపాలన చేస్తున్నారు. 1970లలో చమురుతో షార్జా అభివృద్ధి ఆకాశానికి ఎగసింది.
షార్జాలోని అరాడా ప్రాజెక్టులో భారతీయ కొనుగోలుదారులు 29 శాతం మంది ఉన్నారు. గత కొన్నేళ్ల క్రతం వీరి సంఖ్య 8.7 శాతంగా ఉండేది. అలాగే జర్మనీ, కెనడా, యూకేలకు చెందినవారు 10 శాతం మంది ఉన్నారు. దుబాయ్ విమానాశ్రయం నుంచి కేవలం 20 నిమిషాల దూరంలో ఉన్న అల్జాడాలో నిర్మాణాన్ని ప్రారంభించే ముందు అరాడా గృహాల విక్రయ ధర చదరపు అడుగుకు 650 దీరమ్స్ (177 డాలర్లు)గా ఉంది. ప్రస్తుతం అది 140 దీరమ్స్ కి పెరిగింది. అయినప్పటికీ అవి దుబాయ్‌లో పోల్చదగిన ప్రాంతాల కంటే 40% కంటే తక్కువగా ఉన్నాయి. దుబాయ్ నుంచి ప్రజలు తరలిరావడం వల్ల షార్జాలో కూడా ధరలు పెరిగాయి.
కానీ ఇప్పటికీ రెండు మార్కెట్ల మధ్య వ్యత్సాసం చాలా ఉంది. ఉదాహరణకు షార్జాలో ఏడాదికి 60వేల దీరమ్స్ తో సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ అద్దెకు వస్తుంది. కానీ ఆ మొత్తానికి దుబాయ్ లో స్టూడియా రూమ్ కూడా రాదు. కొత్త అద్దెదారులకు అద్దె మొత్తాన్ని మూడేళ్ల వరకు పెంచకూడదని షార్జా నిబంధన విధించింది. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకు ఓసారి మాత్రమే అద్దె పెంచడానికి అనుమతి ఉంటుంది. మరోవైపు ఇతర డెవలపర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అబుదాబికి చెందిన ఈగిల్ హిల్స్ షార్జాలోని మర్యం ద్వీపంలో 4.5 బిలియన్ దిర్హామ్ లగ్జరీ గృహాలతో పర్యాటక గమ్యస్థానాన్ని నిర్మిస్తోంది.