హైదరాబాద్‌లో మోడ్రన్ స్కై స్క్రేపర్‌లో నివసించాలని భావించే వారి కోసం రూపుదిద్దుకుంటున్న సరికొత్త లగ్జరీ ప్రాజెక్టే.. అన్వితా హై నైన్ ఎట్ కొల్లూరు. టూ, త్రీ బీహెచ్‌కే లైఫ్ స్టయిల్ అపార్టుమెంట్స్తో పాటు ఫోర్ బీహెచ్‌కే స్కైవి ల్లాస్ను ఈ ప్రాజెక్టులో డిజైన్ చేశారు. దాదాపు పదిహేను ఎకరాల్లో తొమ్మిది టవర్లను నిర్మిస్తున్నారు. ఇందులో అన్ని రకాల ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉండటం విశేషం. మరి, ప్రతిఒక్కర్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని విశేషాలివిగో..
హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ప్రప్రథమంగా స్కై వాక్ ప్రాజెక్టు ఆరంభమైంది. దుబాయ్‌లో ప్రస్థానం మొదలెట్టి హైదరాబాద్‌కు విచ్చేసిన అన్వితా గ్రూప్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టే.. హై నైన్. తెల్లాపూర్ ఎంఎంటీఎస్ స్టేషన్ చేరువలో.. కొల్లూరు ఓఆర్ఆర్ సెకండ్ ఎగ్జిట్ పక్కనే.. మొదలైన ఈ ప్రాజెక్టును సుమారు పదిహేను ఎకరాల్లో డెవలప్ చేస్తోంది. 30 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పైభాగంలో.. వాకింగ్ ట్రాక్‌ను డిజైన్ చేశారు. అంతేకాదు.. ఇందులో వచ్చే మొత్తం తొమ్మిది టవర్లను కలుపుతూ ప్రత్యేకంగా కనెక్టింగ్ బ్రిడ్జీలను ఏర్పాటు చేస్తున్నారు. అసలు హైదరాబాద్‌లో ఇలా ఒక ఆకాశహర్మ్యాన్ని కలుపుతూ.. స్కై వాక్‌లను ఏర్పాటు చేయడం ఇదే ప్రప్రథమం అని అన్వితా గ్రూప్ ఘంటాపథంగా చెబుతోంది.
దుబాయ్, డల్లాస్, న్యూయార్క్ వంటి నగరాల్లో దర్శనమిచ్చే ఆధునిక ఆకాశహర్మ్యాల్ని తలదన్నే రీతిలో.. హైదరాబాద్‌లో మోడ్రన్ స్కై స్క్రేపర్.. హై నైన్కు అన్వితా గ్రూప్ శ్రీకారం చుట్టింది. టూ, త్రీ బీహెచ్‌కే లైఫ్‌స్టయిల్ అపార్టుమెంట్స్తో పాటు 29, 30వ అంతస్తుల్లో ఫోర్ బీహెచ్‌కే స్కై విల్లాలను డిజైన్ చేసింది. 15 ఎకరాల్లో వచ్చే తొమ్మిది టవర్లతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గల రెండు ఎమినిటీస్ బ్లాకులను అదనంగా ఏర్పాటు చేసింది. ఎనభై శాతం కంటే అధిక ఓపెన్ స్పేస్ గల ఈ ప్రాజెక్టులో ప్రతి టవర్‌కు ఎంట్రెన్స్ లాంజ్‌లను ఏర్పాటు చేసింది. మరో ఆకర్షణ ఏమిటంటే.. పోడియంలో ఎక్కడా ట్రాఫిక్ అనేదే ఈ హై నైన్లో కనిపించదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి కోసం ప్రత్యేకంగా ఆఫీస్ స్పేసెస్, విడిగా పెట్ పార్కు, వీకెండ్ మార్కెట్ కోసం విడిగా స్థానం కల్పించింది.
ఎమినిటీస్ విషయానికి వస్తే.. ఇందులో ఆధునిక క్లబ్‌హౌజ్‌లో పొందుపర్చని సదుపాయమంటూ లేదనే చెప్పాలి. రెండు స్విమ్మింగ్ పూల్స్, కిడ్స్ పూల్, ప్రీవ్యూ థియేటర్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు.. క్రెష్, ప్రీ ఫంక్షన్ ఏరియా, మల్టీపర్పస్ హాల్, జిమ్, ఏరోబిక్స్, స్పా, మసాస్, జకూజీ, సానా, స్టీమ్, సెలూన్.. ఇలా ప్రతిఒక్క ఆధునిక సదుపాయాన్ని హై నైన్లో అన్వితా గ్రూప్ పొందుపర్చింది. హైదరాబాద్‌లోని వెస్ట్ కారిడార్‌లో ఆనందకరమైన రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలని కోరుకునేవారికి అన్వితా హై నైన్ ను మించిన ప్రాజెక్టు లేదనే చెప్పాలి. పైగా, ఈ ప్రాజెక్టుకు ఎంతో సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. కోకాపేట్ నియోపోలిస్ నుంచి కేవలం ఎనిమిది నిమిషాల్లో హై నైన్కు చేరుకోవచ్చు. మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి మహా అయితే ఇరవై నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. మొత్తానికి, హైదరాబాద్‌లో థ్రిల్లింగ్ లైఫ్ స్టయిల్‌ను కోరుకునేవారికి.. అన్వితా హై నైన్ అమితంగా నచ్చతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం.. వెంటనే కింద డిస్ప్లే అయ్యే నెంబర్‌కు కాల్ చేయండి. లేట్ చేయకుండా మీకు నచ్చిన ఫ్లాట్‌ను బుక్ చేసుకోండి.