- ఓ కేసులో రెరా ఆదేశం
ఆర్థిక సమస్యల కారణంగా బుకింగ్ రద్దు చేసుకున్న గృహ కొనుగోలుదారుకు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిందేనని రెరా స్పష్టంచేసింది. ఫ్లాట్ మొత్తంలో ఒక శాతం మినహాయించుకుని కొనుగోలుదారు చెల్లించిన బుకింగ్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఓ డెవలపర్ ను ఆదేశించింది. పులకేష్ జి మజుందార్ అనే వ్యక్తి ముంబై సమీపంలోని థానేలో రూ.67 లక్షల విలువైన ఓ ఫ్లాట్ ను బుక్ చేసుకున్నారు. ఇందుకోసం 2022 ఏప్రిల్ 3న రూ.లక్ష చెల్లించారు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా 45 రోజులలోపు బుకింగ్‌ను రద్దు చేసుకున్నారు. కానీ బుకింగ్ మొత్తాన్ని డెవలపర్ తిరిగి ఇవ్వలేదు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఆ మొత్తం తిరిగి రాదని డెవలపర్ వాదించారు.
దీంతో మజుందార్ మహారాష్ట్ర రెరాను ఆశ్రయించారు. వాదనలు విన్న రెరా.. అపార్ట్ మెంట్ మొత్తం విలువలో 1.5 శాతం మొత్తాన్ని మినహాయించుకోవడం సమంజసం కాదని పేర్కొంది. బుకింగ్ చేసుకునన 45 రోజులలోపు దానిని రద్దు చేసినట్లయితే 1% జప్తు చేయడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయని పేర్కొంది. అందువల్ల ఫ్లాట్ మొత్తం విలువలో 1% తీసివేసిన తర్వాత ఎటువంటి వడ్డీ లేకుండా కొనుగోలుదారు చెల్లించిన డబ్బును తిరిగి చెల్లించాలని డెవలపర్‌ని ఆదేశించింది.