poulomi avante poulomi avante

ఈవోఐల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డంలో టీజీ రెరా అట్ట‌ర్ ఫ్లాప్‌..?

ముంబై, బెంగ‌ళూరుకు చెందిన నిర్మాణ సంస్థ‌లు.. హైద‌రాబాద్‌కు విచ్చేసి.. ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తుంటే.. టీజీ రెరా అథారిటీ పెద్ద‌గా ప‌ట్టించుకోనే ప‌ట్టించుకోదు. మ‌రి, ఆయా సంస్థ‌లంటే టీజీ రెరా ఛైర్మ‌న్ స‌త్యనారాయ‌ణ‌కు ఎందుకంత ప్రేమో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు. మ‌రి, ఈ విష‌యం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికైనా తెలుసో లేదోన‌ని ప‌లు నిర్మాణ సంస్థ‌లు ప్ర‌శ్నిస్తున్నాయి. కోకాపేట్‌లో ఆయా కంపెనీలు విచ్చ‌ల‌విడిగా ప్రీలాంచుల్లో అమ్ముతుంటే.. రేపొద్దున ఆయా కంపెనీలు.. రేటు గిట్టుబాటు కాలేద‌నో.. పెద్ద‌గా లాభం రాలేద‌నో.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు క‌ట్టేసి వెళ్లిపోతే ఎలా? ఎందుకంటే ఇదివ‌ర‌కు ముంబైకి చెందిన ఒక‌ట్రెండు నిర్మాణ సంస్థ‌లు ఇలాగే వ్య‌వ‌హ‌రించిన విష‌యం చాలామందికి తెలియ‌క‌పోవ‌చ్చు.

సోష‌ల్ మీడియాలో ఛానెల్ పార్ట్‌న‌ర్లు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నా చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంది. అదే హైద‌రాబాద్ రియ‌ల్ సంస్థ‌లు ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను అమ్ముతుంటే.. వారికి నోటీసులిస్తుంది. ఆయా సంస్థ‌లు క‌న్స‌ల్టెంట్ల ద్వారా ఆమ్యామ్యాల్ని స‌మ‌ర్పిస్తే.. ఎంచ‌క్కా తీసేసుకుంటుంది. అంతేత‌ప్ప‌, టీజీ రెరా వ‌ల్ల కొనుగోలుదారుల‌కు పెద్ద‌గా ఉప‌యోగం లేద‌నే చెప్పాలి. త‌ప్పు చేసే బిల్డ‌ర్ల‌పై కొర‌డా ఝ‌ళిపించాల్సిన అధికారులు.. నిమ్మ‌కు నీరెత్త‌కుండా వ్య‌వ‌హ‌రిస్తే.. హైద‌రాబాద్ నిర్మాణ రంగం మ‌రింత దారుణంగా దెబ్బ తింటుంది. ఏదో తూతూమంత్రంగా కొన్ని కేసుల్లో తీర్పులిస్తూ చేతులు దులిపేసుకుంటుంది తప్ప నిర్మాణ రంగానికి ఉప‌యోగ‌ప‌డే విధంగా టీజీ రెరా పెద్ద‌గా ప‌ని చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయ్‌.

టీజీ రెరా గురించి పెద్ద‌గా అవ‌గాహ‌న లేని ఛానెల్ పార్ట్‌న‌ర్లు.. ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ), ప్రీలాంచులంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. మ‌రి, నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇలా ఫ్లాట్ల‌ను విక్ర‌యించకూడ‌ద‌నే సంగ‌తి ఛానెల్ పార్ట్‌న‌ర్ల‌కు ఎవ‌రు వివ‌రిస్తారు? ఇలాంటి వారే క‌దా.. త‌క్కువ రేటుకే ఫ్లాట్లంటూ అమాయ‌కుల‌కు అర‌చేతిలో స్వ‌ర్గం చూపెట్టి.. అందిన‌కాడికి డ‌బ్బులు తీసుకుని మోసం చేశారు. మ‌రి, సోష‌ల్ మీడియాలో వెలువెత్తుతున్న ప్రీలాంచ్ ప్ర‌క‌ట‌న‌లపై టీజీ రెరా ఎందుకు స్పందించ‌ట్లేదు? ఎందుకు ఆయా ఛానెల్ పార్ట్‌న‌ర్ల‌పై చ‌ర్య‌ల్ని తీసుకోవ‌డం లేదు? అని ఔత్సాహిక కొనుగోలుదారులు ప్ర‌శ్నిస్తున్నారు. హైద‌రాబాద్‌లో నిర్మాణ రంగం దారుణంగా దెబ్బ‌తిన‌డానికి.. అస‌లైన బ‌య్య‌ర్ల‌కు ఈ రంగంపై ఆస‌క్తి స‌న్న‌గిల్ల‌డానికి.. రెరా స‌మ‌ర్థంగా ప‌ని చేయ‌క‌పోవ‌డ‌మో కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. టీజీ రెరా స‌మ‌ర్థంగా ప‌ని చేసి ఉంటే.. హైద‌రాబాద్‌లో ప్రీలాంచ్ కంపెనీలు పుట్టుకొచ్చేవే కాదు క‌దా. ఈ విష‌యాన్ని అర్థం చేసుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. టీజీ రెరా ఛైర్మ‌న్‌ను త‌ప్పించే అవ‌కాశముంద‌ని స‌చివాల‌య వ‌ర్గాలు అంటున్నాయి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles