Categories: LATEST UPDATES

ఆ ఫ్లాట్లను రిజిస్టర్ చేయకుంటే చర్యలు తప్పవు

బిల్డర్లకు అధికారుల హెచ్చరిక

రిజిస్టర్ పెండింగ్ లో ఉన్న దాదాపు 1100 ఫ్లాట్లను వెంటనే రిజిస్టర్ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని బిల్డర్లకు అధికార యంత్రాంగం హెచ్చరిక జారీ చేసింది. నోయిడా అథార్టీలోని 21 ప్రాజెక్టుల్లో 1097 ఫ్లాట్లు రిజిస్టర్ కాలేదని, వెంటనే వాటిని రిజిస్టర్ చేయకుంటే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నోయిడా అథార్టీ స్పష్టం చేసింది. ఆ జాబితాలోని ప్రాజెక్టు డెవలపర్లపై ఎలాంటి బకాయిలు లేనప్పటకీ, 21 ప్రాజెక్టులో 1097 ప్లాట్లు రిజిస్టర్ కాలేదని పేర్కొంది. ఆయా ఫ్లాట్ల రిజిస్ట్రీకి ఆమోదం లభించినప్పటికీ, బిల్డర్లు ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడంతో కొనుగోలుదారులు యాజమాన్య హక్కులు కోల్పోతున్నారని అథార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో వాటి రిజిస్ట్రీకి చర్యలు చేపట్టకుంటే లీజు డీడ్ నిబంధనలు, రెరా నిబంధనల కింద బిల్డర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

This website uses cookies.