Categories: LEGAL

కార్వీ గ్రూప్ చైర్మన్ పై మరో కేసు?

కార్వీ కుంభకోణం కేసులో అరెస్టు అయి ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆ సంస్థ చైర్మన్ పార్థసారథిపై మరో కేసు నమోదైంది. 2009లోను అమ్ముడుపోయిన వెంచర్ లోని ప్లాట్లను మళ్లీ విక్రయించినందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కొత్త కేసు నమోదు చేశారు. ఇది ఆయనపై మూడో కేసు కావడం గమనార్హం. క్లయింట్ల షేర్లను అక్రమంగా తనఖా పెట్టి రుణం పొందిన కేసులో పార్థసారథితో పాటు కార్వీ సీఎఫ్ఓ హరికృష్ణ గతంలో అరెస్టయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్థసారథిపై కొత్త కేసు నమోదైంది.

కోల్ కతాకు చెందిన ఓ ఇన్వెస్టర్ తోపాటు కేరళకు చెందిన ముగ్గురు వ్య్తులు తాము కార్వీ రియల్టీలో ప్లాట్ల కోసం రూ.85 లక్షల చెల్లించామని.. మహేశ్వరంలోని కార్వీ నోవా వెంచర్స్ లో ప్లాట్లను చూపించి విక్రయానికి ఉన్నట్టు చెప్పడంతో ఆ మేరకు చెల్లింపులు జరిపామని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. అయితే, కార్వీ నోవా వెంచర్లోని ప్లాట్లన్నీ 2009లో ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఆ పాత ప్రాజెక్టులో ప్లాట్లను మళ్లీ విక్రయించడానికి కారణాలేమిటనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

This website uses cookies.