భారతదేశం యొక్క ఫ్లెక్సిబుల్ స్పేస్ స్టాక్ సంవత్సరానికి 10-15% చొప్పున వచ్చే మూడేళ్ల పాటు పెరుగుతుందని సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. ఈ స్పేస్ ప్రస్తుతం 36 మిలియన్ చదరపు అడుగులున్నట్లు సీబీఆర్ఈ తెలియజేసింది.
2021 మొదటి త్రైమాసికంలో బెంగళూరు 11.6 మిలియన్ చదరపు అడుగుల ఫ్లెక్స్ స్టాక్ కలిగి ఉంది. ఇది దేశంలో గరిష్టమని చెప్పొచ్చు. ఢిల్లీ, ఎన్సీఆర్ లో 6.6 మిలియన్ చదరపు అడుగులు, హైదరాబాద్లో 5.7 మిలియన్ చదరపు అడుగుల స్టాకు అందుబాటులో ఉంది. ముంబైతో పాటు ఈ నగరాలు మరింత డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి. పుణే, చెన్నై వంటి నగరాల్లో ఫ్లెక్స్ డిమాండ్ కూడా రాబోయే సంవత్సరాల్లో వృద్ధిని సాధిస్తుందని సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 2020 లోనే, భారతదేశం అంతటా 75,000 సీట్లను ఫ్లెక్స్ ప్రదేశాలలో లీజుకు తీసుకున్నారని ప్రకటించింది.
‘‘వ్యాపారాలు పనిచేసే విధానాన్ని మరియు వారి మొత్తం వ్యూహాలను కరోనా తీవ్రంగా ప్రభావితం చేసిందని ఈ సందర్భంగా సీబీఆర్ఐ హెడ్ అంశుమన్ మ్యాగజీన్ తెలిపారు. వ్యాపార కార్యాలయాలు ప్రధాన కార్యాలయ సౌలభ్యాన్ని ఉంచే కొత్త పని నమూనాలను అంచనా వేస్తున్నాయని అన్నారు.