poulomi avante poulomi avante

అశోకా బిల్డ‌ర్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్. జైవీర్ రెడ్డి ఇక లేరు..

  • ఆయ‌న మ‌ర‌ణ‌వార్త విని..
  • షాక్‌కు గురైన తెలంగాణ నిర్మాణ రంగం

తెలంగాణ నిర్మాణ రంగానికి చెందిన ఓ ప్రముఖ తార నింగికెగిసింది. అశోకా బిల్డర్స్ వ్యవస్థాపకుడు, సీఎండీ ఎన్. జైవీర్ రెడ్డి ఆదివారం రాత్రి 9.06 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్త విని హైదరాబాద్ నిర్మాణ రంగమంతా దిగ్భ్రాంతి చెందింది. స్వ‌త‌హాగా సివిల్ ఇంజినీరు అయిన జైవీర్ రెడ్డి భాగ్య‌న‌గ‌రంలోనే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ‌ను స్థాపించ‌డంతో పాటు.. విజ‌య‌వంతంగా అనేక ప్రాజెక్టుల్ని పూర్తి చేశారు. గతంలో ఆయన క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. హైద‌రాబాద్ నిర్మాణ రంగాన్ని గ‌తిని మార్చేసిన జీవో నెం. 86 రూపొందించ‌డంలో ఆయ‌న ప్ర‌త్యేకంగా కృషి చేశారు. రియ‌ల్ ప‌రిశ్ర‌మ‌ను గాడిలో పెట్టే అనేక నిర్ణ‌యాల్ని తీసుకోవ‌డంలో ముఖ్య‌భూమిక పోషించారు. ప్ర‌స్తుతం ఆయ‌న కుమారుడు జైదీప్ రెడ్డి అశోకా బిల్డ‌ర్స్ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్నారు.

* ఈ సందర్భంగా క్రెడాయ్ నేషనల్ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్ రెడ్డి.. జైవీర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక పెద్ద దిక్కును కోల్పోయినందుకు క్రెడాయ్ నేషనల్ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ట్రెడా సంఘం అధ్యక్షుడు చలపతిరావు ఆయన హఠాన్మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. జైవీర్ రెడ్డి మరణం నిర్మాణ రంగానికి తీరని లోటు అని టీబీఎఫ్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు తెలిపారు. హైద‌రాబాద్ నిర్మాణ రంగం అభివృద్ధిలో ఆయ‌న పాత్ర అమోఘ‌మైన‌ద‌ని న‌రెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ ప్రేమ్ కుమార్ అన్నారు.

అశోక బిల్డర్స్ అధినేత జైవీర్ రెడ్డి మృతిపట్ల ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించిన ఈటల రాజేందర్, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్లో పని చేసినప్పట్నుంచి జైవీర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన స్నేహితుడు నల్గొండకు చెందిన పాల్వాయ్ నర్సింహారెడ్డి గుర్తు చేసుకున్నారు. తమ ఇద్దరిని పెద్దారెడ్డి, చిన్నారెడ్డి అని ప్రతిఒక్కరూ పిలిచేవారని తెలిపారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles