poulomi avante poulomi avante

కోకాపేట్‌లో 2 బీహెచ్‌కే ఫ్లాట్లు ల‌భ్యం.. ఎక్క‌డంటే?

  • సైబ‌ర్‌సిటీ డెవ‌ల‌ప‌ర్స్ వెస్ట్ బ్రూక్‌
  • 7.8 ఎక‌రాలు.. జి+35 అంత‌స్తులు
  • ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 టోల్ గేటు ఒక్క నిమిష‌మే
  • కొన్ని 2 బీహెచ్‌కే ఫ్లాట్లు మాత్ర‌మే ల‌భ్యం..

సాధార‌ణంగా కోకాపేట్ నియోపోలిస్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే.. అక్క‌డ ల‌భించే స్కై స్క్రేప‌ర్ల‌లో.. 4 నుంచి 10 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఫ్లాట్లు ల‌భిస్తాయ‌ని చాలామంది భావిస్తారు. కానీ, అదంతా ఒట్టి అపోహేన‌ని అధిక శాతం మందికి తెలియ‌దు. ఎందుకంటే, ఔట‌ర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ ఒక‌టో టోల్ గేటు నుంచి కేవ‌లం ఒకే ఒక్క నిమిషంలో చేరుకునే అంత స‌మీపంలో.. ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ నుంచి మ‌హా అయితే ఐదంటే ఐదే నిమిషాల్లో చేరుకునేంత స‌మీపంలో.. సైబ‌ర్ సిటీ డెవ‌ల‌ప‌ర్స్ సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్ అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. సుమారు 7.8 ఎక‌రాల్లో జి ప్ల‌స్ 35 అంత‌స్తుల ఎత్తులో నిర్మిస్తున్న వెస్ట్ బ్రూక్ ప‌క్క‌నే ఐటీ కంపెనీలు ఉండ‌టంతో.. వాక్ టు వ‌ర్క్ కాన్సెప్టును కోరుకునే వారి కోసం ఇందులో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఔనా.. టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇందులో దొరుకుతాయా అని ఆశ్చ‌ర్య‌పోకండి.

హైద‌రాబాద్‌లో ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ నామ్స్ ప్ర‌కారం ల‌గ్జ‌రీ ప్రాజెక్టుల్ని నిర్మించే అతికొద్ది సంస్థ‌ల్లో.. ప్ర‌ముఖంగా నిలుస్తుంది సైబ‌ర్ సిటీ డెవ‌ల‌ప‌ర్స్‌. ఈ సంస్థ తాజాగా కోకాపేట్ స‌ర్వీస్ రోడ్డు ప‌క్క‌నే.. నియోపోలిస్‌కు కూత‌వేటు దూరంలో.. వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును డిజైన్ చేసింది. సుమారు 7.8 ఎక‌రాల్లో.. 82 శాతం ఓపెన్ స్పేస్‌తో జి ప్ల‌స్ 35 అంత‌స్తుల ఎత్తులో మూడు ట‌వ‌ర్ల‌ను నిర్మిస్తోంది. దేశంలోనే పేరెన్నిక గ‌ల ఆర్కిటెక్ట్ అయిన హ‌ఫీజ్ కాంట్రాక్ట‌ర్‌.. వెస్ట్ బ్రూక్‌ను అత్య‌ద్భుతంగా డిజైన్ చేశారు. కోకాపేట్ లేక్ ప‌క్క‌నే  ఉండ‌టంతో.. ప్ర‌కృతి ఒడిలో ల‌గ్జ‌రీ లివింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ కోరుకునేవారికి ఈ ప్రాజెక్టు ప‌ర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఐటీ కంపెనీల‌కు చేరువ‌లో.. హాయిగొలిపే వాతావ‌ర‌ణంలో ప్ర‌శాంతంగా జీవ‌నాన్ని కొన‌సాగించాల‌ని కోరుకునేవారికి ప‌క్కాగా సూట్ అవుతుంది.. సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టు. వివిధ ర‌కాల కొనుగోలుదారుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా.. సుమారు 1075 చదరపు అడుగుల నుంచి 2400 చదరపు అడుగుల మధ్యలో 2, 3, 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్ల‌ను డిజైన్ చేశారు.

2 BHK flats available in Kokapet
west brook 2 BHK flats available in Kokapet

టూ బీహెచ్‌కే ఫ్లాట్స్‌
సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్ స్పెషాలిటీ Cybercity West Brook Specialty ఏమిటంటే.. 1075 మ‌రియు 1210 చ‌ద‌రపు అడుగుల్లో ఎంచ‌క్కా టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. కోకాపేట్‌లోని వివిధ ఐటీ కంపెనీల్లో నెల‌కు ల‌క్ష రూపాయ‌ల్లోపు జీత‌మున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు.. ఈ ప్రాజెక్టు చ‌క్క‌గా న‌ప్పుతుంది. కొత్త‌గా పెళ్లయిన‌వారైనా.. పెళ్ల‌య్యి ఇద్ద‌రు చిన్న పిల్ల‌లున్న ఓ చిన్న కుటుంబానికైనా సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్ ఇట్టే న‌చ్చుతుంది. పైగా, మీకో ఇంట్రెస్టింగ్ విష‌యం చెప్ప‌నా.. ఇన్వెస్ట‌ర్లు ఇందులో టూ బెడ్రూమ్ ఫ్లాట్ల‌ను కొన్నార‌నుకోండి.. ఎలాగూ ఈ ప్రాజెక్టును 2025 డిసెంబ‌రు లోపు హ్యాండోవ‌ర్ చేస్తామ‌ని సంస్థ చెబుతోంది. అలా కొన‌గానే ఇలా ఇంటీరియ‌ర్స్ ప‌నులు చేయించుకుంటే.. ఎంచ‌క్కా అద్దెల‌కు ఇచ్చేయ‌వ‌చ్చ‌. పైగా, కోకాపేట్ కావ‌డం వ‌ల్ల‌.. న‌గ‌రంలోని మిగ‌తా ప్రాంతాల‌తో పోల్చితే ఇక్క‌డ టూ, త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్ల‌కు మంచి అద్దెలు గిట్టుబాట‌వుతాయి.

కోకాపేట్లోని నియోపోలిస్‌కు చేరువ‌లో.. జ‌స్ట్ స‌ర్వీస్ రోడ్డు ప‌క్క‌నే.. జోరుగా నిర్మిత‌మ‌వుతున్న సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టుకు అటుఇటుగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. కోకాపేట్ ఏరియా జీసీసీల‌కు హ‌బ్‌గా మారుతోంది. కోకాపేట్‌తో పాటు ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టుల్లో క‌లిపి ప్ర‌స్తుతం ముప్ప‌య్ మిలియ‌న్ ఎస్ఎఫ్‌టీల్లో ఐటీ స‌ముదాయాల నిర్మాణం జ‌రుగుతోంది. సుమారు ప‌ద్నాలుగు మిలియ‌న్ ఎస్ఎఫ్‌టీ ఆఫీస్ స్పేస్‌ను.. వివిధ జీసీసీలు తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే, రాయ‌దుర్గంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కోసం ఎస్ఎఫ్‌టీకి 110 రూపాయ‌లు దాకా పెట్టాల్సి వస్తుంది. ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, కోకాపేట్‌లో అయితే ఎస్ఎఫ్టీకి 50 నుంచి 70 రూపాయ‌ల‌కే ఆఫీసు స్పేస్ ల‌భిస్తోంది. అందుకే, అధిక శాత జీసీసీలు ఇక్క‌డే త‌మ ఆఫీసుల‌ను ఏర్పాటు చేయ‌డానికి ముందుకొస్తున్నాయి. పైగా, సైబ‌ర్ సిటీ వెస్ట్ బ్రూక్ ప‌క్క‌నే అనేక ఐటీ సంస్థ‌లున్నాయి. భ‌విష్య‌త్తులో అనేక కంపెనీలు ఇక్క‌డికొస్తాయి. ఇలాంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటే.. టూ బెడ్రూమ్ ఫ్లాట్ల‌ను కొనుక్కోవ‌డానికి సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును మించింది లేద‌ని చెప్పొచ్చు.

వ‌చ్చే ఒక‌ట్రెండేళ్ల‌లో ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, కోకాపేట్‌లో ఏర్పాట‌య్యే జీసీసీ కంపెనీల్లో ఎంత‌లేద‌న్నా ల‌క్ష మంది ఉద్యోగులైనా ప‌ని చేయ‌డానికి ఆస్కారం ఉంటుంది. వీరిలో అద్దెల‌కోస‌మైనా.. స్థిరనివాసం కోస‌మైనా.. సైబ‌ర్‌సిటీ వెస్ట్‌బ్రూక్ ప్రాజెక్టును మించింది లేద‌ని చెప్పొచ్చు. అందుకే, మేం గ‌ట్టిగా చెప్పే విష‌యం ఏమిటంటే.. అద్దెల ద్వారా క్ర‌మం త‌ప్ప‌కుండా ఆదాయం రావాల‌ని కోరుకునేవారికి.. కోకాపేట్‌లోని వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టు ఒక మంచి ఆప్ష‌న్ అని చెప్పొచ్చు. అందుకే, మీరేమాత్రం ఆలోచించ‌కుండా.. ఒక్క‌సారి ఈ ప్రాజెక్టును సంద‌ర్శించండి. సైబ‌ర్‌సిటీ వెస్ట్ బ్రూక్ గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకు అన్నివిధాల న‌ప్పితే.. ఎంచ‌క్కా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇందులో త్రీ బెడ్‌రూం ఫ్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయ‌నే విష‌యాన్ని మీరు ఎట్టి ప‌రిస్థితిలో మ‌ర్చిపోవ‌ద్దు.
For Details: 

Call: 8374626262
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles