Categories: LATEST UPDATES

ఐపీఓకు ముందే రూ.122 కోట్లు సమీకరించిన ఆర్కేడ్ డెవలపర్స్

రియల్టీ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్ లిమిటెడ్ తన తొలి ఐపీఓకు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.122.40 కోట్లు సమీకరించింది. రూ.410 కోట్ల నిధుల సమీకరణ కోసం కంపెనీ తన షేర్ ధరను రూ.121-128 మధ్య ఖరారు చేసింది. ఐపీఓకు సంబంధించి ఈనెల 16న సబ్ స్క్రిప్షన్ఓపెన్ కాగా, 19 వరకు అందుబాటులో ఉందచింది. ఇందులో పాల్గొనాలనుకునేవారు కనీసం 110 షేర్లు కొనాల్సి ఉంటుంది.

యాంకర్ ఇన్వెసర్లకు 30 శాతం వాటా కేటాయించగా.. క్యూఐబీలకు 20 శాతం వాటా, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం వాటా కేటాయించింది. ఇందులో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.128కి ఒక షేర్ చొప్పున 95,62,500 షేర్లు కేటాయించి రూ.122.40 కోట్లు సమీకరించింది. ఈ ఇన్వెస్టర్లలో బీఎన్ పీ పారిబస్ ఫైనాన్షియల్ మార్కెట్స్- ఓడీఐ, సెయింట్ కేపిటల్ ఫండ్ వంట సంస్థలు ఉన్నాయి.

ఐపీఓ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రస్తుతం కొనసాగుతున్నా ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి, అలాగే కొత్త ప్రాజెక్టులకు అవసరమైన భూమిని కొనుగోలు చేయడానికి వినియోగించనుంది. కాగా, ముంబైకి చెందిన ఆర్కేడ్ డెవలపర్స్ 2023 జూలై 31 నాటికి 1.80 మిలియన్ చదరపు అడుగులు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను అభివృద్ది చేసింది.

This website uses cookies.