ప్రముఖ నటి దీపికా పదుకొనే ముంబైలోని సాగర్ రేషమ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీపికాకు చెందిన కేఏ ఎంటర్ ప్రైజెస్ ముంబై బాంద్రాలో ఉన్న ఈ సొసైటీలో 1845 చదరపు అడుగుల అపార్ట్ మెం ను రూ.17.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఈనెల 12న ఈ లావాదేవీ రిజిస్టర్ అయింది. ఎనార్మ్ నాగ్ పాల్ రియల్టీ ఎల్ఎల్ పీ నుంచి ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ హౌసింగ్ సొసైటీలో అన్నీ 4, 5 బీహెచ్ కే ఫ్లాట్లే ఉండగా.. దీపిక కొన్న అపార్ట్ మెంట్ 15వ అంతస్తులో ఉంది. బిల్టప్ ఏరియా ధర చదరపు అడుగుకు రూ.96,400గా పలికింది.
ఈ కొనుగోలుకు సంబంధించి రూ.1.07 కోట్లు స్టాంపు డ్యూటీగా, రూ.30వేలు రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించారు. మరోవైపు దీపికా భర్త రణ వీర్ సింగ్ కు చెందిన ఆర్ఎస్ ఫిల్మ్ క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయన తల్లి నుంచి పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ ను నెలకు రూ.8.2 లక్షల అద్దెకు లీజుకు తీసుకుంది. ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.73.8 లక్షలు చెల్లించింది. 55 నెలల కాలానికి లీజు ఒప్పందం కుదుర్చుకోగా, మొదటి 33 నెలలకు రూ.8.2 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తారు. తదుపరి 22 నెలల్లో నెలకు రూ.9.43 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. రణ్ వీర్ తల్లి అంజు భవ్నానీ ఈనెల ప్రారంభంలో రూ.19.13 కోట్లకు ఆ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు.
ఇది 1822.45 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. కాగా, ఈ బాలీవుడ్ జంట ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ రాజభవనం మన్నత్ కు సమీపంలోని బాంద్రా బ్యాండ్ స్టాండ్ లో సముద్రానికి అభిముఖంగా ఉన్నఓ క్వాడ్రప్లెక్స్ ను కూడా కొనుగోలు చేసింది. 11,266 చదరపు అడుగుల స్థలంతోపాటు 1300 చదరపు అడుగుల టెర్రస్ తో కూడిన ఈ ఫ్లాట్ 16వ అంతస్తు నుంచి 19వ అంతస్తు వరకు నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. దీని విలువ రూ.100 కోట్లకు పైమాటే అని సమాచారం. అంతేకాకుండా ఈ జంట అలీబాగ్ లో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు. కాగా, బాంద్రాలో ప్రాపర్టీ ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ ప్రాపర్టీ ఉన్న ప్రదేశం, దాని వయసు ఆధారంగా చరదపు అడుగు ధర రూ.50వేల నుంచి రూ.1.50 వరకు ఉంటుంది.
కార్టర్ రోడ్, బ్యాండ్ స్టాండ్, పాలి హిల్ వంటి అనేక ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకు రూ.లక్ష కంటే ఎక్కువగా ఉంటాయి.
This website uses cookies.