poulomi avante poulomi avante

ఇల్లు కొనేముందు..  ఈ ఛార్జీలుంటాయ్!

ఎవరికైనా సొంతిల్లు ఓ కల. మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకంటూ ఓ ఇల్లుంటే ఆ ఆనందమే వేరు. మరి ఇల్లు కొనేముందు ఎలాంటి చార్జీలు మనం చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడం ఉత్తమం కదా? అవేంటో ఓసారి చూద్దాం.
బ్రోకరేజ్ ఫీజు: నగరంలో ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉందో వెతికి పట్టుకోవడం కష్టం. అందుకే చాలామంది మధ్యవర్తులు, బ్రోకరేజీ సంస్థలను ఆశ్రయిస్తుంటారు. మీరు బ్రోకరేజ్ సంస్థ లేదా రియల్టర్ ద్వారా ఇల్లు కొనాలని భావిస్తే.. ముందుగా ఆ కంపెనీ లేదా వ్యక్తి రెరా కింద నమోదై ఉన్నారో లేదో తప్పనిసరిగా చూడండి. మనకు ఇల్లు వెతికిపెట్టినందుకు బ్రోకరేజీ సంస్థ లేదా రియల్టర్ కు కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని ఇటు కొనుగోలుదారుడు, అటు ప్రాజెక్టు బిల్డరు కూడా చెల్లిస్తారు. సాధారణంగా ఇది ఇల్లు లేదా ప్లాట్ మొత్తంలో 2 శాతం ఉంటుంది. కొన్నిచోట్ల ఇది ఎక్కువ లేదా తక్కువగా ఉండొచ్చు.
స్టాంప్ డ్యూటీ: ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తమే స్టాంప్ డ్యూటీ. ప్రాపర్టీని మీ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇది తప్పనిసరి. స్టాంప్ డ్యూటీ చెల్లించకపోతే ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించకోవడం కుదరదు. స్టాంప్ డ్యూటీని అగ్రిమెంట్ విలువ, మార్కెట్ విలువల్లో ఏది ఎక్కువగా ఉంటే దాని ఆధారంగా లెక్కిస్తారు. ఇది సాధారణంగా మూడు నుంచి ఏడు శాతం మధ్య ఉంటుంది. రాష్ట్రాన్ని బట్టి ఇందులో తేడాలుంటాయి.రిజిస్ట్రేషన్ ఫీజు: రిజిస్ట్రేషన్ అనేది అమ్మకందారు నుంచి కొనుగోలుదారు సదరు ఆస్తిని కొనుగోలు చేసి హక్కులు బదలాయించుకున్నట్టు చేసే అధీకృత ఒప్పంద పత్రం. ఆస్తికి సంబంధించి ఇది అత్యంత కీలకపత్రం. ఈ పత్రాన్ని పొందడం కోసం చెల్లించే ఫీజునే రిజిస్ట్రేషన్ ఫీజు అంటారు.
సర్ చార్జ్: స్టాంపు డ్యూటీకి అదనంగా సెస్, సర్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.35 లక్షలకు పైబడిన విలువ కలిగిన ప్రాపర్టీలకు పట్టణాల్లో అయితే 10 శాతం సెస్ తోపాటు 2 శాతం సర్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో 3 శాతం సర్ చార్జి చెల్లించాలి.

జీఎస్టీ: కంప్లీషన్ సర్టిఫికెట్ కలిగిన గృహాలకు జీఎస్టీ వర్తించదు. అదే నిర్మాణంలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేసినప్పుడు 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రాపర్టీ తనిఖీ చార్జీలు: బ్యాంకు రుణం ద్వారా ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు బ్యాంకు సిబ్బంది సదరు ఇల్లు లేద స్థలం ఉన్న ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అలాగే బిల్డర్ ట్రాక్ రికార్డు కూడా చూస్తారు. ఇందుకోసం బ్యాంకులు ప్రాపర్టీ తనిఖీకి చార్జ్ చేస్తాయి. ఒకవేళ మీరు సదరు బ్యాంకు పాత వినియోగదారుడు అయితే, దానిని మాఫీ చేసే అవకాశం ఉంటుంది.

లొకేషన్ ప్రాధాన్యత చార్జీలు: ఇల్లు లేదా ఫ్లాట్ ప్రాధాన్యతను బట్టి కూడా కొంతమొత్తం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేసే అపార్ట్ మెంట్ ఫ్లాట్ నుంచి లేక్ వ్యూ కావాలనుకుంటే కొంత అదనంగా ఇవ్వక తప్పదు. అలాగే చాలామంది డెవలపర్లు పై అంతస్తుకు వెళ్లే కొద్దీ అదనంగా చార్జ్ చేస్తారు.

మెయింటనెన్స్ లేదా సొసైటీ సెక్యూరిటీ డిపాజిట్: అపార్ట్ మెంట్ ఓనర్స్ అసోసియషన్ లేదా సొసైటీ.. సదరు భవనం నిర్వహణ చార్జీలను నిర్ధారిస్తుంది. ఫ్లాట్ తుది మొత్తంలో ఇది ఉండదు. సెక్యూరిటీ గార్డుల జాతాలు, రోడ్లు, పార్కులు, లాన్ల నిర్వహణ తదితరాల కోసం ఫ్లాట్ కొనుగోలుదారుడు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటీరియర్స్: ఇంటీరియర్ డెకరేషన్ కు సంబంధించి అయ్యే మొత్తాన్ని మనమే చెల్లించాల్సి ఉంటుంది.

పార్కింగ్ స్పేస్: మీ అపార్ట్ మెంట్ భవనంలో కార్ పార్కింగ్ ప్రదేశం కోసం కొంత మొత్తం వెచ్చించక తప్పదు. అపార్ట్ మెంట్ లొకేషన్, పార్కింగ్ సైజ్, అది ఉన్న ప్రాంతం తదితర అంశాల ఆధారంగా ఈ మొత్తం ఉంటుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles