రచ్చబండ గురించి తెలుసు కదా? ఊళ్లో నలుగురూ కూర్చుని పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రదేశం. నటి సోనాక్షి సిన్హా ముంబై నివాసంలో అలాంటిదే ఒకటుంది. అయితే, రచ్చబండకు ఆధునిక రూపం అన్నమాట. దానిని కన్వర్సేషన్ పిట్ అంటారు. గతంలో ఊళ్లలో ఉండే రచ్చబండకు సోనాక్షి.. తనదైన శైలిలో మోడ్రన్ టచ్ జోడించి అద్భుతంగా తన ఇంట్లో డిజైన్ చేయించుకున్నారు. లివింగ్ ఏరియాలో విలాసవంతమైన కుర్చీలతో దీనిని రూపొందించారు. డిజిటల్ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత తరుణంలో వాటన్నింటి నుంచి కాస్త ఉపశమనం కలిగించేందుకు.. బంధుమిత్రులతో అనుబంధాలు పెంచేందుకు ఈ నవతరపు రచ్చబండ ఉపకరిస్తుందనేది సోనాక్షి భావన.
చక్కని డిజైన్ కు సోనాక్షిని ఇంటిని ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. రెడ్ ఆర్కిటెక్ట్స్ కి దిన రాజీవ్, ఏక్తా పరేఖ్ లు కలిసి సోనాక్షి అపార్ట్ మెంట్ ని డిజైన్ చేశారు. క్లాసిక్ ఫ్లెయిర్ ని మోడ్రన్ సెన్సిబిలిటీతో కలపడానికి ఇది ఓ అద్భుతమైన ఉదాహరణ. ఇంటి మధ్యలో కన్సర్వేషన్ పిట్ డిజైన్ చేశారు. ఈ అపార్ట్ మెంట్ బాల్కనీలో పర్సనల్ స్విమింగ్ పూల్ కోసం స్థలం కేటాయించారు. ఆర్కిటెక్టులు దీనినే కన్సర్వేషన్ పిట్ గా మార్చారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఇదే సోనాక్షికి అత్యంత ఇష్టమైన ప్రదేశంగా మారిపోయింది. దాని గురించి ఆమె వివరిస్తూ.. ‘డెక్ ప్రాంతం నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. అక్కడ సమయం అలా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే మరీ బావుంటుంది. రద్దీగా ఉండే ముంబైలో వర్షాన్ని చూడటానికి, సూర్మరశ్మిని ఆస్వాదించడానికి ఇదో చక్కని అభయారణ్యం వంటిది’ అని పేర్కొన్నారు.
This website uses cookies.