poulomi avante poulomi avante

సీఎం రేవంత్‌రెడ్డి సందేశం కోసం బిల్డ‌ర్లు ఎదురుచూపు

  • ఈ నెల 20న నోవాటెల్‌లో..
    క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్ 2024
  • రాష్ట్ర‌వ్యాప్తంగా బిల్డ‌ర్లు హాజ‌రు
  • డెవ‌ల‌ప‌ర్ల‌కు ఈ స‌ద‌స్సు కీల‌కం
  • అధిక శాతం మంది హాజ‌రు..

క్రెడాయ్ తెలంగాణ సంస్థ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా.. క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 20న ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. అమెరికా ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం చేసుకుని.. సియోల్ న‌గ‌రాన్ని ప‌ర్య‌టించి.. న‌గ‌రానికి విచ్చేసి.. కాగ్నిజెంట్ కొత్త కార్యాల‌యాన్ని ఆరంభించిన.. మ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్ 2024కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం న‌లువైపుల నుంచి ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేస్తున్న వంద‌లాది మంది బిల్డ‌ర్లు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినేందుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

నిర్మాణ రంగానికి దిక్సూచీగా ఈ కార్య‌క్ర‌మం నిలుస్తుందని క్రెడాయ్ తెలంగాణ బిల్డ‌ర్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో మూడు రోజుల్లో నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మంలో.. నిర్మాణ రంగానికి సంబంధించిన‌.. ప‌లు కీల‌క‌మైన అంశాల‌పై లోతైన చ‌ర్చ జ‌రుగుతుంద‌ని రియ‌ల్ ఎస్టేట్ గురుకి అందిన స‌మాచారం. సెషన్-1లో భాగంగా తెలంగాణ విజన్ 2050పై చర్చ జరగనుంది. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే సమగ్ర అభివృద్ధిని పెంపొందించడానికి కావాల్సిన తెలంగాణ సమగ్ర విధానాన్ని ఈ సందర్భంగా చర్చిస్తారు. లక్ష్య విధాన వ్యూహాత్మక పెట్టుబడులు, మెగా మాస్టర్‌ప్లాన్ 2050, మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా పట్టణ, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో సమానమైన వృద్ధిని నిర్ధారించడంలో రాష్ట్ర ప్రయత్నాలను ఇది హైలైట్ చేస్తుంది.

సంతులిత మరియు సమ్మిళిత అభివృద్ధి నమూనాను రూపొందించే లక్ష్యంతో విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమంలో రాష్ట్రం చేపట్టిన కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. రెరాకు సంబంధించి డెవలపర్ బాధ్యతలు, కొనుగోలుదారు హక్కులు, ఇతరత్రా అంశాలపై నెల‌కొన్న సందేహాలను ప్యానెలిస్టులు నివృత్తి చేస్తారు. క్రెడాయ్ దిగ్గజాలు.. వ్యాపార లాభదాయకతను పెంచడానికి, తెలంగాణ శక్తివంతమైన మార్కెట్‌లో బలమైన స్థాపనకు నిరూపితమైన వ్యూహాలను ఈ కార్య‌క్ర‌మంలో చర్చిస్తారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లన ఎలా ఎదుర్కోవాలనే అంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతుంది.

తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ఇతర ఆశాజనక నగరాల్లో పెట్టుబడులు పెట్టడం, పట్ణణాభివృద్ధి అవకాశాలపై విజయగాథలపై చ‌ర్చ‌లు జ‌రుగుతాయి. తెలంగాణలో స్కిల్డ్ లేబ‌ర్‌పై స్టేట్‌కాన్ ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంది. టైర్ II, III, IV నగర రియల్ ఎస్టేట్ డెవలపర్లను, వారి బ్రాండ్‌ను విజయవంతం చేసేందుకు సమగ్ర వ్యూహాలపై చ‌ర్చ జ‌రుగుతుంది. లీడ్ జనరేషన్ కోసం సమర్థవంతమైన పద్ధతులను తెలుసుకుంటారు. బ్రాండ్ విలువ పెంపొందించుకోవడంతో పాటు విక్రయాలను ఎలా పెంచుకోవాలి? సోషల్ మీడియాను ఎలా వినియోగించుకోవాలి వంటివి చ‌ర్చిస్తారు. నిర్మాణ ప్రాజెక్టుల్లో సుస్థిరతను ఎలా సాధించాలో బిల్డ‌ర్లు తెలుసుకుంటారు. డిజైన్ ఆప్టిమైజేషన్, మెటీరియల్ ఎంపిక, వినూత్న నిర్మాణ పద్ధతుల ద్వారా ఖర్చు-పొదుపు అవకాశాలను గుర్తిస్తూ, కర్బన ఉద్గారాలను తగ్గించే వ్యూహాల‌పై అవ‌గాహ‌న పెంచుకుంటారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles