Categories: LATEST UPDATES

పాత ఇల్లు కొనడమే గగనమే

భాగ్యనగరంలో భారీగా పెరిగిన పాత ఇళ్ల ధరలు

సాధారణంగా కొత్త ఇల్లు కొనేంత స్తోమత లేనివారు ఆర్థికభారం తగ్గుతుందనే ఉద్దేశంతో పాత ఇల్లు కొనుక్కోవాలని చూస్తుంటారు. అయితే, హైదరాబాద్ లో సెకండ్ హ్యాండ్ హోమ్ కూడా ఖరీదైన వ్యవహారంగానే మారిపోయింది. కొత్త ఇంటికి పెట్టేంత ధరకు దాదాపుగా సమానంగా ఉండటంతో కొనుగోలుదారులు తర్జనభర్జన పడుతున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాతే పాత ఇళ్లకు కూడా ధరలు బాగా పెరిగి. వెస్ట్ లో గచ్చిబౌలిలో, తూర్పున ఉప్పల్ లో, ఉత్తరాన కొంపల్లిలలో, దక్షిణాన బండ్లగూడలో రూ.50 లక్షల్లోపు ధరతో పాత ఇల్లు కొనాలనుకునేవారికి నిరాశే మిగులుతోంది. ఐటీ కారిడార్ లో సెకండ్ హ్యాండ్ 2 బీహెచ్ ధర చదరపు అడుగుకు రూ.7వేలు, 3 బీహెచ్ కే ధర రూ.9వేలు పలుకుతోంది.

కొత్త ప్లాట్ల ధరలతో పోలిస్తే ఇలాంటి ప్రాంతాల్లో పాత ఇళ్ల ధరలు 75 శాతం నుంచి 80 శాతం వరకు ఉండటం గమనార్హం. దీంతో అటు భారం భరించి కొత్త ఇంటికి వెళ్లాలా లేక పాత ఇంటినే ఎంచుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. లేకుంటే తమ బడ్జెట్ లో కొత్త ఇల్లు వచ్చే శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పదని అనుకుంటున్నారు. కరోనా తర్వాత తిరిగి కార్యాలయాలు తెరుచుకోవడం అందరూ హైదరాబాద్ వచ్చేశారు. కోరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా సొంతిల్లు ఉండటం మంచిదని భావిస్తున్నారు. దీంతో పాత ఇళ్లకు కూడా డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

This website uses cookies.