poulomi avante poulomi avante

త్రిశంకు స్వ‌రంలో న‌గ‌ర రియాల్టీ..

జీవో 111 ఎత్తివేత పుణ్య‌మా అంటూ.. హైద‌రాబాద్ రియ‌ల్ రంగంలో భూముల లావాదేవీలు ఒక్క‌సారిగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. నిన్న‌టివ‌ర‌కూ పోటీ ప‌డి భూములు కొన్న‌వారంతా ప్ర‌స్తుతం ల‌బోదిబోమంటున్నారు. పెట్టుబ‌డి నిమిత్తం ప్లాట్లు కొన్న‌వారు అమ్ముకోలేక‌పోతున్నారు. అంతెందుకు, ఇదివ‌ర‌కే ప‌లువురు బిల్డ‌ర్ల వ‌ల్ల విల్లాలకు అడ్వాన్సులు ఇచ్చిన‌వారూ వెన‌క‌డుగు వేస్తున్నారు. ప‌శ్చిమ హైద‌రాబాద్‌లో ఫ్లాట్లు కొనాల‌ని భావించేవారు వేచి చూసే ధోర‌ణీని అల‌వ‌ర్చుకున్నారు. మొత్తానికి, ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేత వ‌ల్ల ఒక్క‌సారిగా హైద‌రాబాద్ రియాల్టీ త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టి మిట్టాడుతోంది.

ట్రిపుల్ వన్ జీవో ప్రాంతానికి పక్కనే కోకాపేట్ ఉన్న విషయం తెలిసిందే. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో ఎకరం ధర రూ.5 నుంచి 6 కోట్లు పలుకుతుంటే.. కోకాపేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక‌రం ధ‌ర రూ.40 నుంచి రూ.50 కోట్లు ప‌లుకుతోంది. ఈమధ్య ప్రభుత్వమేమో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయ‌డంతో.. స్థల యజమానులు భూముల్ని అమ్మడం ఆపివేశారు. కొంతకాలం వేచి చూస్తే.. అధిక రేటుకు అమ్ముకోవచ్చని వీరి ఆశ. కాక‌పోతే, కొంద‌రు కాస్త రేటు పెంచి అమ్మ‌డానికి ప్ర‌య‌త్నించినా.. కొనుగోలుదారులు ధైర్యంగా కొనేందుకు ముంద‌కు రావ‌ట్లేదు. కోర్టులు ట్రిపుల్ జీవో మీద ప్ర‌తికూల నిర్ణ‌యం తీసుకుంటే ఎలా? అంత రేటు పెట్టి కొన‌డం వృథా క‌దా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పెట్టిన రేటు కూడా రాక‌.. మ‌ళ్లీ ధ‌ర పెర‌గ‌డానికి ఇంకెంత కాలం ప‌డుతుందేమోన‌ని సందేహిస్తున్నారు.

ఇదివ‌ర‌కే అధిక రేటు పెట్టి.. మోకిలా, శంక‌ర్‌ప‌ల్లిలో విల్లాలు కొన్న‌వారు.. ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేసుకుంటున్నారు. కార‌ణం.. ఇక్క‌డ పెట్టే రేటుకు ట్రిపుల్ జీవో ప్రాంతంలో అయితే క‌నీసం అర ఎక‌రం స్థ‌లం వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. దీంతో, ఆయా విల్లాల్ని విక్ర‌యించే డెవ‌ల‌ప‌ర్లో ల‌బోదిబో మంటున్నారు. ఇదంతా ఒక ఎత్త‌యితే, ఫ్లాట్లలో పెట్టుబ‌డి పెట్టేవారిది విచిత్ర ప‌రిస్థితి. కోకాపేట్‌లో రూ.3 నుంచి 4 కోట్ల రూపాయ‌లు ఫ్లాట్ల మీద పెట్టుబ‌డి పెట్ట‌డం కంటే.. కాస్త ముందుకెళ్లి ట్రిపుల్ వ‌న్ ప్రాంతంలో స్థ‌లం కొనుక్కుంటే.. ఎంచ‌క్కా త‌మ‌కు న‌చ్చిన‌ట్టు ఇల్లు కొనుక్కోవ‌చ్చ‌ని ఆలోచిస్తున్నారు. మ‌రోవైపు, యూడీఎస్ మ‌రియు ప్రీలాంచ్లో ఫ్లాట్లు కొన్న‌వారిది గ‌డ్డు ప‌రిస్థితి. పెరిగిన నిర్మాణ సామ‌గ్రి ధ‌ర‌ల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. బిల్డ‌ర్లు స‌కాలంలో ఫ్లాట్ల‌ను నిర్మించి ఇస్తారా? లేదా? అని మ‌థ‌న‌ప‌డుతున్నారు. మొత్తానికి, హైద‌రాబాద్ రియాల్టీ త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టిమిట్టాడుతోంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles