Categories: TOP STORIES

లేఅవుట్ల‌లోకి నిర్మాణ సంస్థ‌లు!

  • ద‌క్షిణ హైద‌రాబాద్‌పై అధిక దృష్టి
  • మ‌న్‌సాన్‌ప‌ల్లిలో గ‌జం రూ.18 వేలే
  • జ‌హీరాబాద్‌లో గ‌జం రూ.1,999

హైరైజ్ నిర్మాణాలు, ఆకాశ‌హ‌ర్మ్యాలు, ల‌గ్జ‌రీ విల్లాలు, ఫైవ్ స్టార్ హోట‌ళ్లు, ఐటీ స‌ముదాయాల్ని అభివృద్ధి చేసే నిర్మాణ సంస్థ‌లు తాజాగా లేఅవుట్ల విభాగంలోకి రంగప్ర‌వేశం చేశాయి. వీటిలో ఎక్కువ‌గా ద‌క్షిణ హైద‌రాబాద్ వైపు దృష్టి సారించ‌గా.. మ‌రికొన్నేమో జ‌హీరాబాద్లోకి అడుగుపెట్టాయి. ద‌శాబ్దం క్రిత‌మో సంస్థ శంక‌ర్‌ప‌ల్లిలో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. ఆత‌ర్వాత హైరైజ్ క‌ట్ట‌డాల‌నే అధికంగా చేప‌ట్టింది. తాజాగా, అధిక శాతం కంపెనీలు వెంచ‌ర్ల‌ను డెవ‌ల‌ప్ చేస్తుండ‌టం తాజా పోక‌డ‌ని చెప్పొచ్చు. మ‌రిన్ని సంస్థ‌లు ఈ విభాగంలోకి అడుగుపెట్ట‌డానికి ఆస్కారముంద‌ని స‌మాచారం.

పీబీఈఎల్ సిటీ, వ‌న్ సిటీ, వీబీ సిటీ వంటి నిర్మాణాల‌తో హైద‌రాబాద్‌లో త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ఇండిస్ సంస్థ తాజాగా లేఅవుట్ విభాగంలోకి ప్ర‌వేశించింది. ఈ సంస్థ మ‌హేశ్వ‌రం స‌మీపంలోని దుబ్బ‌చ‌ర్ల‌లో కొత్త లేఅవుట్‌ని ఆరంభించింది. దీనికి స్ప్రింగ్ డేల్ అని నామ‌క‌ర‌ణం చేసింది. సుమారు 21.75 ఎక‌రాల్లో విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ వెంచ‌ర్‌లో ప్లాట్ల సైజును 180 నుంచి 230 గ‌జాలుగా నిర్ణ‌యించారు. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. గ‌జానికి రూ.18 వేలు చెబుతున్నారు. ఇందులో మొత్తం 319 ప్లాట్లు వ‌స్తాయి.

ఎందుకు అక్క‌డ‌?

ద‌క్షిణ హైద‌రాబాద్‌లో మ‌న‌సాన్‌ప‌ల్లి చుట్టుప‌క్క‌ల ప్రాంతం అతివేగంగా అభివృద్ధి చెంద‌డానికి ఆస్కార‌ముంది. మ‌హేశ్వ‌రం ఎస్ఈజెడ్ స‌మీపంలో ఉండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ఇక్క‌డ్నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యానికి సులువుగా చేరుకోవ‌చ్చు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తుక్కుగూడ ఓఆర్ఆర్ స‌మీపంలో విల్లాలు కొనాలంటే రూ.2 నుంచి 4 కోట్లు దాకా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో అయితే ఓ రూ.35 ల‌క్ష‌లు పెట్టి ప్లాటు కొనుగోలు చేసి.. ఎంచ‌క్కా రూ.20 ల‌క్ష‌ల్లో ల‌గ్జ‌రీ ఇల్లు క‌ట్టుకోవ‌చ్చు. చేతిలో సొమ్ము ఎక్కువుంటే డ్యూప్లే కూడా నిర్మించుకోవ‌చ్చు. కాబ‌ట్టి, కోట్లు పెట్టి విల్లాల్ని కొన‌డం బ‌దులు.. ఇక్క‌డ ప్లాటు కొని భ‌విష్య‌త్తులో ఇల్లు క‌ట్టుకోవ‌డం కంటే ఉత్త‌మ‌మైన ప‌ని లేద‌ని చెప్పొచ్చు.

వ‌ర్టెక్స్ గిగా సిటీ..

వ‌ర్టెక్స్ హోమ్స్ తుక్కుగూడ‌లో గిగా సిటీ అనే ల‌గ్జ‌రీ గోల్ఫ్ విల్లా గేటెడ్ క‌మ్యూనిటీని డెవ‌ల‌ప్ చేస్తోంది. శంషాబాద్ విమానాశ్ర‌యం చేరువ‌లో హై ఎండ్ బ్యూటీఫుల్ కమ్యూనిటీలో నివ‌సించాల‌ని భావించేవారికి గిగాసిటీ కంటే మించిన ప్రాజెక్టు లేద‌నే చెప్పాలి. ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ త‌ర‌హాలో గిగాసిటీని సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇందులో అంత‌ర్జాతీయ విద్యాసంస్థ‌లు, షాపింగ్ మాళ్లు, ఆస్ప‌త్రి, స్పోర్ట్స్ అకాడ‌మీల‌కు పెద్ద‌పీట వేసింది.

విమానాశ్ర‌యం చేరువ‌లో ప్రెస్టీజ్‌!

ప్రెస్టీజ్ ఎస్టేట్స్ శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి ఐదు కిలోమీట‌ర్ల దూరంలో గ‌ల మామిడిప‌ల్లిలో ప్రెస్టీజ్ ఆర్చ‌డ్స్ అనే ల‌గ్జ‌రీ లేఅవుట్ని డెవ‌ల‌ప్ చేస్తోంది. సుమారు 43 ఎక‌రాల్లో 322 ప్లాట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 2000 నుంచి 5720 చ‌ద‌ర‌పు అడుగుల్లో విక్ర‌యిస్తోంది. అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. చ‌ద‌ర‌పు అడుగుల్లోనే అమ్ముతోంది. రెరా అనుమ‌తి పొందిన ఈ లేఅవుట్‌లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి.. 2025 సెప్టెంబ‌రులో బ‌య్య‌ర్ల‌కు అంద‌జేస్తుంద‌ని స‌మాచారం.

గ‌జం.. రూ.1999 మాత్ర‌మే

నిర్మాణ రంగంలో 35 ఏళ్ల అనుభ‌వం గ‌ల మంజీరా గ్రూప్ జ‌హీరాబాద్‌లోకి అడుగుపెట్టింది. ఇటాలియ‌న్ థీమ్ ఆధారంగా సుమారు 122 ఎక‌రాల విస్తీర్ణంలో 200 ఫామ్ ప్లాట్ల‌ను డెవ‌ల‌ప్ చేస్తోంది. ఇందులో న‌ల‌భైకి పైగా సౌక‌ర్యాల్ని అంద‌జేస్తున్నామ‌ని సంస్థ చెబుతోంది. ఔట్‌డోర్ స్విమ్మింగ్ పూల్‌, మినీ గోల్ఫ్‌, ఓపెన్ ఎయిర్ యోగా డెక్‌, పార్టీ డెక్‌, బార్‌బీక్యూ, బోన్‌ఫైర్ స్పేస్‌, కూర‌గాయ‌లు మ‌రియు పండ్ల తోట‌, బాస్కెట్ బాల్ కోర్టు, స్క్వాష్ కోర్టు, కిడ్స్ ప్లేయింగ్ జోన్‌, రోప్ వాకింగ్‌, అడ్వెంచ‌ర్ పార్క్ వంటివి డెవ‌ల‌ప్ చేస్తోంది. బిజినెస్ సెంట‌ర్లు, గెస్ట్ రూములు, కాటేజీలు వంటివి డెవ‌ల‌ప్ చేస్తోంది. మొత్తానికి, జ‌హీరాబాద్‌లోనే అంత‌ర్జాతీయ స్థాయిలో ట‌స్క‌నీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టుని మంజీరా సంస్థ అభివృద్ధి చేస్తోంది.

This website uses cookies.