poulomi avante poulomi avante

హైదరాబాద్ లో గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మాణాలు

  • హరిత భవనాల ద్వార 40 శాతం కాలుష్య నివారణ
  • గ్రీన్ బిల్డింగ్స్ తో 30 నుంచి 50 శాతం నీటి ఆదా
  • హరిత భవనాలతో 20 నుంచి 30 శాతం విద్యుత్ ఆదా

భారత్ లో నిర్మాణరంగం అంతకంతకు అభివృద్ది చెందుతోంది. దేశంలోని మోట్రో నగరాలతో పాటు పట్టాణాల్లోను భారీ భవనాలు వెలుస్తున్నాయి. ఐతే నిర్మాణవ్యర్ధాల వల్ల కాలుష్యం పెరిగిపోతున్న సమయంలో నిర్మాణ రంగ సంస్థలు హరిత భవణాల నిర్మాణంవైపు మొగ్గుచూపుతున్నాయి. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం భారీ ఎత్తున హరిత ప్రమాణాలతో నివాస, వాణిజ్య నిర్మాణాలను చేపట్టాయి పలు నిర్మాణ సంస్థలు. అందుికు అనుగునంగానే ఇంటి కొనుగోలుదారులు సైతం గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టులపైవే ఆసక్తి చూపుతున్నారు.

దేశంలో నిర్మాణరంగం మంచి జోరుమీదుంది. ఆకాశమే హద్దుగా ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో ప్రపంచ స్థాయి కార్యాలయాల భవనాలు నిర్మిస్తూ, నిర్మాణ రంగంలో ప్రతి సంవత్సరం విస్తీర్ణం పెంచుకుంటూ పోతున్నారు. స్థానిక సంస్థలతో పాటు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీపడి మరీ భారీ కట్టడాలను కడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కార్యాలయాల, గృహ అవసరాల మేరకు నిర్మాణాలు సైతం పెరుగుతున్నాయి. ఐతే నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున కాలుష్య ఉద్గారాలు వెలువుడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నగరాల్లో 40 శాతం కాలుష్యం రియల్‌ ఎస్టేట్, ఇన్‌ఫ్రా నుంచే వస్తోందని జేఎల్‌ఎల్‌ వంటి సంస్థల నివేదికలు చెబుతున్నాయి. కాలుష్యకారకమైన అతి సూక్ష్మ కణాలు అత్యంత తీవ్రస్థాయికి చేరిన ప్రపంచంలోని 20 నగరాల్లో 18 నగరాలు మన భారత్‌ లోనే ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌ నగరం సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

నిర్మాణ సమయంలో ఒకరకమైన కాలుష్యం వెదజల్లుతుంటే, భవనం పూర్తయి వినియోగంలోకి వచ్చాక ఏసీలు, విద్యుత్తు వాడకం పెరుగుదలతో మరోరకమైన కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. వేసవితో సంబంధం లేకుండా ప్రస్తుతం ఇళ్లలో విద్యుత్తు వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో కరెంట్‌ బిల్లులు మరింతగా జేబుకు చిల్లు పెడుతున్నాయి. వీటిని తగ్గించడం ద్వారా ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసుకోవచ్చు. నిర్మాణాల నుంచి వెలువడుతున్న 40 శాతం కాలుష్య ఉద్గారాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని చెబుతోంది ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్. ఇల్లే సహజసిద్ధంగా చల్లగా ఉండేలా, పగటిపూట లైట్లతో సంబంధం లేకుండా వెలుతురు ఉండేలా ఇంటి వాతావరణం ఉంటే సాధ్యమైనంత తక్కువగా విద్యుత్తు వాడకం ఉంటుంది. హైదరాబాద్ లో పలు సంస్థలు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నింటినీ హరితభవన ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ హరిత భవనాలను ప్రోత్సహిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటించే నిర్మాణ ప్రాజెక్టులకు రేటింగ్‌ ఇస్తోంది. నిర్మాణ సంస్థ చేసుకున్న దరఖాస్తులో పొందుపర్చే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తాంది. ప్రాజెక్టును బట్టి సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినమ్‌ రేటింగ్‌ ఇస్తారు. ఈ క్రమంలో పెద్ద నిర్మాణ ప్రాజెక్టులన్నీ భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. బోర్‌ వెల్స్‌ రీఛార్జ్‌ అయ్యేలా, ఇంజెక్షన్‌ వెల్స్‌, ఇంకుడుగుంతలను నిర్మిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్‌కు, ఇంట్లో టాయిలెట్‌ ఫ్లషింగ్‌కు ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా నీరు చాలావరకు తిరిగి వినియోగం అవుతుంది. ఇలా హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టుల్లో 30 నుంచి 50 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇదివరకు ఇళ్లలో విద్యుత్తు వినియోగం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు పెరిగిపోయాయి. కూలర్లు, ఏసీల వాడకం బాగా పెరిగింది. అందుకని నిర్మాణ సమయంలోనే గది ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గించే సామగ్రిని ఉపయోగిస్తే చాలావరకు సమస్య తీరినట్లేనని నిర్మాణరంగ నిపుణులు చెబుతున్నారు. హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ఇంటిలో 20 నుంచి 30 శాతం మేర విద్యుత్తును ఆదా అవుతుంది. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు, నీటి కాలుష్యంతో పాటు శబ్ధకాలుష్యం సైతం తగ్గించవచ్చు. ఫలితంగా అందులో నివసించేవారి ఆరోగ్యంతో పాటూ ఉత్పాదకత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ ప్రాజెక్టులు గ్రీన్ బిల్గింగ్ కాన్సెప్ట్ తో నిర్మాణాలు చేపట్టాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లుగా నిర్మించే నిర్మాణాలన్నింటిని హరిత భవనాల కాన్సెప్ట్ లోనే నిర్మిస్తూవస్తున్నాయి. తెలంగాణ కొత్త సచివాలయ భవనం, టీ-హబ్, టీ-వర్క్స్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాల్లో నిర్మించిన కొత్త కలెక్టరేట్ భవనాలు, ఆస్పత్రులు, హెల్త్‌కేర్ క్యాంపస్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ టవర్లలో గ్రీనరీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా తెలంగాణ పచ్చని బాటలో నడుస్తోంది.

నిర్మాణంలో భవనాలు, సామగ్రితో పాటూ నిర్మాణ సామగ్రి తయారయ్యే విధానానికి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ రేటింగ్‌ ఇస్తోంది. గ్రీన్‌ప్రో ధృవీకరణ పొందిన 7000 కు పైగా ఉత్పత్తుల వాడకంతో పర్యావరణహితంగా ఉంటాయి. సోలార్ పవర్ ఏర్పాటుతో వందశాతం కరెంట్‌ అవసరాలను తీర్చుకోగలిగితే నెట్‌జీరో ఎనర్జీ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 35 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐజీబీసీ రేటింగ్‌ కోసం నిర్మాణ ప్రాజెక్టులు రిజిస్టర్‌ అయ్యాయి. ఇలాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వాలు కొంత మేర రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రియల్ రంగ సంస్థలు కోరుతున్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles