దేశ స్థిరాస్తి రంగంలోకి వచ్చిన ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు కాస్త తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 3 శాతం మేర తగ్గినట్టు రియల్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ క్యాపిటల్ వెల్లడించింది. 2024-25లో ఈ పెట్టుబడులు 3.7 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు తెలిపింది. అంతకుముందు ఏడాది ఇవి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు వివరించింది. మయ్యాయి. ఆఫీస్ భవనాలకు పెట్టుబడులు తగ్గడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. 2020-21లో అత్యధికంగా 6.4 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు రాగా, 2021-22లో ఇవి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అయితే 2022-23కల్లా 4.4 బిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. వెరసి గత ఐదేళ్లుగా దేశీ రియల్టీలో పీఈ పెట్టుబడులు తగ్గుతూ వచ్చినట్లు అనరాక్ క్యాపిటల్ ఎండీ సీఈవో శోభిత్ అగర్వాల్ పేర్కొన్నారు. 6.4 బిలియన్ డాలర్ల నుంచి 3.7 బిలియన్ డాలర్లకు అంటే 43 శాతం క్షీణించినట్లు తెలిపారు.