poulomi avante poulomi avante

స్థిరాస్తితో సంపద సృష్టిద్దామా?

స్థిరాస్తి రంగం.. అద్భుతమైన ఆదాయ వనరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా స్థిరమైన, అధిక ఆదాయాన్నిచ్చే రంగాల్లో రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. అందుకే ప్రాపర్టీల్లో పెట్టుబడులు అనేది అత్యంత ఆకర్షణీయమైన అంశం. అయితే, ఏ రంగంలోనైనా సానుకూలతలతోపాటు ప్రతికూలతలూ ఉంటాయి. ఇందుకు స్థిరాస్తి రంగం కూడా ఏమాత్రం మినహాయింపు కాదు. అందువల్ల రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిందే.

ముందుగా మార్కెట్ డైనమిక్స్ఎలా ఉన్నాయో చూడాలి. ప్రాపర్టీ ధరలు, లొకేషన్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, బిల్డర్ పరపతి, రియల్ ఎస్టేట్ లావాదేవీలలో స్థానిక నిబంధనలు, ఆస్తి పన్నులు, చట్టపరమైన విధానాలు అధ్యయం చేయాలి. అనంతరం మీరు దీర్ఘకాలంలో సంపద కోసం చూస్తున్నారా లేక తక్షణ రాబడులు ఆశిస్తున్నారా అనే అంశం ఆధారంగా ముందుకెళ్లాలి. నివాస, వాణిజ్య లేదా అద్దె ఆస్తుల్లో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. అద్దె ప్రాపర్టీలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. అందువల్ల చాలామంది దీని వైపే మొగ్గు చూపిస్తారు. ఇక ప్రాపర్టీ కొనుగోళ్లలో కీలకమైన మరో అంశం.. లొకేషన్. ఎంత మంచి లొకేషన్ అయితే, మీ ప్రాపర్టీకి అంత మంచి విలువ పెరుగుతుంది.

అభివృద్ధి అవకాశాలు, పట్టణ కేంద్రాలకు సామీప్యత, మంచి కనెక్టివిటీ, పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్ కేంద్రాలు వంటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలి. అభివృద్ధి చెందుతున్న పొరుగు ప్రాంతాల లేదా అధిక వృద్ధికి అవకాశాలు ఉన్న నగరాలను గుర్తించడానికి మార్కెట్ ట్రెండ్ లు పరిశీలించాలి. ఏ ప్రాంతాల్లో ఏయే ప్రాపర్టీలకు డిమాండ్ ఉందో తెలుసుకుని తదనుగుణంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.

బడ్జెట్ చాలా ముఖ్యం..

చిన్నదైనా, పెద్దదైనా.. ఎందులోనైనా బడ్జెట్ అనేది చాలా ముఖ్యం. ఆస్తి ఖర్చులు, పన్నులు, నిర్వహణ, పునర్నిర్మాణ ఖర్చులు వంటి అన్ని అంశాలతో మొత్తం ఎంత వ్యయం అవుతుందో ముందే బడ్జెట్ వేసుకోవాలి. రుణాలు లేదా తనఖాలు వంటి ఫైనాన్సింగ్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంత పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టిన తర్వాత మీ నగదు ప్రవాహంపై వాటి ప్రభావం ఎలా ఉందో బేరీజు వేసుకోవాలి. ఆశించిన రాబడి, నగదు ప్రవావాహాలను లెక్కించాలి. ఉదాహరణకు మీరు రూ.50 లక్షల విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తే.. పదేళ్ల తర్వాత దాని విలువ రూ.కోటి అవుతుందనుకుందాం. అయితే, ఇందులో రుణ వడ్డీ ఇతర ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవన్నీ ఆలోచించి, భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా లెక్కలు వేసుకున్న తర్వాత ప్రాపర్టీ కొనుగోలుకు ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయం తీసుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి. కొనుగోలు చేయబోయే ప్రాపర్టీని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. దానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ పరిశీలించాలి. చట్టపరమైన వివాదాలు లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆస్తి హక్కు పత్రాలు అన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేయాలి. ఒప్పందాలు స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి న్యాయ నిపుణుల సహాయం తీసుకోవాలి.

అద్దె ప్రాపర్టీల నిర్వహణా కీలకమే..

అద్దె ప్రాపర్టీల్లో పెట్టుబడి పెడితే, అద్దెదారులను జాగ్రత్తగా పరిశీలించాలి. అద్దెదారులతో చక్కని సంబంధాలు కొనసాగించాలి. రెగ్యులర్ గా సదరు ప్రాపర్టీని తగిన మెయింటనెన్స్ చేయడం ఆస్తి విలువను పెంచడమే కాకుండా అద్దెదారును సంతృప్తిపరుస్తుంది. బహుళ ప్రాపర్టీలను కలిగి ఉంటే.. సమర్థవంతమైన నిర్వహణ కోసం ప్రాఫెషనల్ ప్రాపర్టీ మేనేజర్లను నియమించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఆస్తి విలువ, అద్దె రాబడి, డిమాండ్-సరఫరా వంటి అంశాలు పరిశీలిస్తూ ఉండాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో గణనీయమైన విజయం సాధించడం వీలవుతుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles