poulomi avante poulomi avante

23న‌ క్రెడాయ్ తెలంగాణ‌ టీఎస్ కాన్‌క్లేవ్

క్రెడాయ్ తెలంగాణ ప్ర‌ప్ర‌థ‌మ టీఎస్ కాన్‌క్లేవ్ ఎడిష‌న్‌ను ఆరంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో 23 డిసెంబర్ 2021 తేదీ ఇది జరుగనుంది. దీనిని అనుసరించి 3వ ఎడిషన్ క్రియేట్ అవార్డులు కూడా అందించనున్నారు. అసాధారణ విలువను సృష్టిస్తూనే , నాణ్యతను అందిస్తూ, తెలంగాణా రియల్ ఎస్టేట్ రంగంలో ఆవిష్కరణలను తీసుకురావడంలో ముందుండి అత్యుత్తమ ప్రక్రియలను తీసుకువస్తూనే మిగిలిన వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన రియల్టర్లను గుర్తించి వేడుక చేసే కార్యక్రమం క్రియేట్. సుప్రసిద్ధ పరిశోధన మరియు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్, ఈ క్రియేట్ 2021కు నాలెడ్జ్ భాగస్వామిగా ఉండటంతో పాటుగా న్యాయనిర్ణేతల బృందానికి విభిన్నమైన విభాగాలలో అత్యుత్తమ ప్రాజెక్టులను గుర్తించడంలో సహాయపడుతుంది.

ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలు (ఎస్ఓపీలు) మరియు నిర్ధేశించిన ప్రమాణాలకు కట్టుబడి ఉండేందుకు సరిచూసుకోవాల్సిన అంశాల పట్ల తెలంగాణా రాష్ట్రంలోని 14 చాప్టర్లు మరియు 800 మంది సభ్యులతో కూడిన బిల్డర్లకు తగిన అవగాహన కల్పించడమే ధ్యేయంగా క్రెడాయ్ టీఎస్ కాంక్లేవ్–2021నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభ్యులు అనుసరించాల్సిన ఎస్ఓపీలు గురించి క్రెడాయ్ తెలంగాణా రూపొందించిన పుస్తకాన్ని సైతం ఇక్కడ విడుదల చేయనున్నారు. స్టేట్ కాన్ 2021కు నాలెడ్జ్ భాగస్వామిగా సుప్రసిద్ధ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ వ్యవహరిస్తుంది. ఇది క్రెడాయ్ తెలంగాణాతో అతి సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ తెలంగాణా స్టేట్ కాన్ 2021 శీర్షికన ప్రత్యేక నివేదికనూ విడుదల చేయనుంది. దీనితో పాటు నిర్మాణ రంగ సాంకేతికతలో తాజాగా అంతర్జాతీయంగా జరుగుతున్న ఆవిష్కరణలు వెల్లడిచేస్తూ ప్రత్యేక సదస్సు నిర్వహించడం ద్వారా సమర్థవంతమైన నిర్మాణాల కోసం సభ్యులకు సహాయపడుతుంది.

ఈ సందర్భంగా క్రెడాయ్ తెలంగాణా ఛైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ ‘‘రియల్ ఎస్టేట్ రంగ గొంతుక క్రెడాయ్. రియల్ ఎస్టేట్ రంగం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిల్లో విధానాలు మరియు మార్గదర్శకాల రూపకల్పనలో ప్రభుత్వాలతో అతి సన్నిహితంగా ఇది పనిచేస్తుంటుంది. తెలంగాణా రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగంలో సంస్కరణలు తీసుకురావడంలో ముందుండటంతో పాటుగా టీఎస్–బీపాస్ లాంటి కార్యక్రమాల రూపకల్పనలోనూ కీలకపాత్ర పోషించింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అనుమతికి సంబంధించి సింగిల్ విండో ప్రాసెస్ టీఎస్ –బీపాస్. అలాగే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సమగ్రమైన భూ రికార్డుల నిర్వహణ పోర్టల్ ధరణి ఇప్పుడు స్పష్టంగా భూ రికార్డులను నిర్వచించడంతో పాటుగా ఆదాయాన్ని క్రమబద్దీకరిస్తుంది. ఈ కార్యక్రమాలు అతి సులభంగా వ్యాపార నిర్వహణకు తోడ్పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చురుకైన మరియు విజనరీ పాలసీలు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలలో తాజా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. అలాగే వేగంగా పారిశ్రామికీకరణ సాధ్యం కావడంతో పాటుగా ఉపాధి కల్పన కూడా సాధ్యమై వృద్ధి కూడా వేగవంతం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వ్యవసాయ రంగంలో క్రమబద్దీకరించిన విధానంతో పాటుగా సాగు భూమి కూడా పెరిగింది. రైతు బంధు పథకం ద్వారా వ్యవసాయ రంగానికి తోడ్పాటు లభించడంతో పాటుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సైతం పురోగతి సాధిస్తుంది. ఐటీ, ఐటీఈఎస్, పరిశ్రమలు కాకుండా తెలంగాణా ఆర్థిక వ్యవస్ధ ఇప్పుడు వ్యవసాయ, సంబంధిత రంగాల కారణంగా స్థిరంగా వృద్ధి సాధిస్తుంది. జాతీయ స్ధాయిలో కేవలం 3% వృద్ధి ఈ రంగాల్లో నమోదవుతుంటే ఇక్కడ అది 20.9% నమోదు చేస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధికి తోడ్పడటంతో పాటుగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు డిమాండ్ సైతం వృద్ధి చేస్తుంది.
టీఎస్–కాంక్లేవ్ 2021ను సభ్య డెవలపర్లు, మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నూతన సభ్యులకు సహాయపడే రీతిలో ప్రణాళిక చేశారు. దీనిద్వారా రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధనలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను టీఎస్–రెరా కింద చేపట్టడానికి తీసుకోవాల్సిన అనుమతులు, ప్రాజెక్ట్ ఫైనాన్స్లో ఎదురయ్యే సమస్యలు మరియు నిర్మాణ నాణ్యత మరియు వేగంగా పూర్తి చేసేందుకు అందుబాటులోని సాంకేతికతలు గురించి తెలుపనున్నారు. ఈ టీఎస్ కాంక్లేవ్ 2021లో మరింత మంది పాల్గొనాల్సిందిగా మేము సభ్యులను ఆహ్వానిస్తున్నాము. తద్వారా మరిన్ని ప్రయోజనాలనూ తమ వెంచర్లలో పొందవలసినదిగా కోరుతున్నాము’’ అని అన్నారు.

క్రెడాయ్ తెలంగాణా అధ్యక్షుడు డీ మురళీకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చురుకైన పరిపాలనతో పాటుగా శక్తివంతమైన, ముందుచూపున్న నాయకత్వం కారణంగానే అభివృద్ధి పరంగా తెలంగాణా రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. ఈ రాష్ట్రం ఇప్పుడు ఆఫీస్ స్పేస్ స్వీకరణ, తాజా పెట్టుబడులు వంటి అంశాల పరంగా దేశానికి నాయకత్వం వహించడమే కాదు ఉపాధి కల్పన పరంగానూ అగ్రగామిగా నిలుస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో ఐటీ రంగంలో నూతనంగా 46,489 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 2020–21 ఆర్ధిక సంవత్సరంలో రెండున్నర రెట్ల వృద్ధి పరోక్షంగా ఉద్యోగ మార్కెట్లో కనిపించింది. ఎలకా్ట్రనిక్స్ రంగం కూడా 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. టీఎస్ఐఐసీ ఇప్పటికే 10 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటుగా 810 ఎకరాలను 453 పరిశ్రమలకు కేటాయించి పెట్టుబడి అవకాశాలను తీసుకురావడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా స్టార్టప్స్ వృద్ధి చెందేందుకు తగిన వాతావరణమూ కల్పించింది. తెలంగాణా ఇప్పుడు జాతీయ జీడీపీకి 5% తోడ్పాటును అందిస్తుంది. భారతదేశపు ఐటీ ఎగుమతుల పరంగా రెండవ అత్యధిక తోడ్పాటుదారునిగా ఇది ఉంది. ఐటీ/ఐటీఈఎస్ ఎగుమతుల పరంగా 13% వార్షిక వృద్ధి రేటును రాష్ట్రం నమోదు చేయడంతో పాటుగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో 1.45లక్షల కోట్ల రూపాయల ఎగుమతులను ఇక్కడ నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇది 1.28 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి అత్యధిక తోడ్పాటునూ అందిస్తుంది. డెవలపర్లు ఈ సవాల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉండటంతో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి చెందుతున్న డిమాండ్ను తీర్చడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మా సభ్య డెవలపర్ల ప్రయత్నాలను గుర్తించేందుకు, మా 3వ ఎడిషన్ క్రెడా అవార్డులను ప్రకటించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. దీనిద్వారా అసాధారణ తోడ్పాటునందించడంతో పాటుగా ఆవిష్కరణలు చేస్తూనే కోవిడ్–19 సంక్షోభ సమయంలో కూడా తమ నిబద్ధతను చాటి పరిశ్రమలో నూతన ప్రమాణాలను సృష్టించిన వారిని గుర్తిస్తూ టీఎస్ కాంక్లేవ్ వద్ద సత్కరించనున్నాం’’ అని అన్నారు.

క్రెడాయ్ తెలంగాణా ప్రెసిడెంట్ ఎలక్ట్ ఈ ప్రేమ్ సాగ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ రాష్ట్రంలో మొత్తంమ్మీద అభివృద్ధి కారణంగా మరిన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు డిమాండ్ కూడా పెరిగింది. ఈ అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎంతోమంది రియల్ ఎస్టేట్ వెంచర్లలో అడుగు పెడుతున్నారు. అవగాహన లేమి మరియు తగిన పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఈ నూతన ప్లేయర్లు తరచుగా యుడీఎస్/రెరా అనుమతి లేని ప్రాజెక్టులను విక్రయిస్తున్నారు. ఇది రియల్ఎస్టేట్ మార్కెట్లో అవాంఛిత అవరోధంగా నిలుస్తుంది. క్రెడాయ్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నీతివంతమైన ప్రవర్తనా నియమావళిని అనుసరించాల్సి ఉంది మరియు అధికారులు నిర్ధేశించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాల్సి ఉంది. ఈ నూతన డెవలపర్లకు సహాయపడే ప్రయత్నంలో ఎస్ఓపీలపై ఓ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాము. దీనిలో ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరించాల్సిన మార్గాలైనటువంటి ఎన్ఓసీ పొందడం మొదలు నేపథ్యీకరణ, కొనుగోలుదారులకు తాము కొనుగోలు చేసిన ప్రాజెక్టులను అప్పగించడం వరకూ ప్రతి అంశాన్నీ వెల్లడి చేస్తున్నాo. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ప్రవేశకులకు ఓ మార్గదర్శిగా నిలువడంతో పాటుగా అనుసరించేందుకు అనువుగానూ ఉంటుంది. ఇది మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంతో పాటుగా నాణ్యమైన ప్రాజెక్టులను అందించేందుకు, డిమాండ్ మరియు సరఫరా ఖాళీలను పూరించేందుకు సైతం తోడ్పడుతుంది’’ అని అన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles