-
ధరణి పేరుతో పెద్దఎత్తున అవినీతి
-
రైతుల్ని దోచుకోవడమే లక్ష్యమా?
-
వైఎస్ షర్మిల్ తీవ్ర ఆగ్రహం
ధరణి వెబ్ సైటును ఎవరి కోసం చేశారు? కొండ నాలుకకు ముందు వేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్లు ధరణి పరిస్థితి అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజక వర్గం దమ్మపేట మండల కేంద్రంలో పాదయాత్ర లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ధరణి వెబ్ సైటును ఎవరి కోసం చేశారని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
నాలుగు ఎకరాలున్న రైతుకు రెండు ఎకరాలు.. ఎకరమున్న రైతుకు భూమి లేనట్లుగా చూపిస్తోెందంటూ అందులోని లోపాల్ని ఎత్తి చూపారు. ధరణి పేరు చెప్పి అంతా అవినీతి మయం చేశారని విమర్శించారు. ధరణి పెట్టీ కరెక్షన్స్ కోసం రైతులు ఎందుకు అప్లికేషన్ ఫీజులు కట్టాలంటూ నిలదీశారు. రైతులను దోచుకోవడం కోసం ఇదో రకం వసూలు అని.. ధరణి ద్వారా ఈ ప్రభుత్వం రైతుల రక్తం తాగుతోందని దుయ్యబట్టారు. అసలు కేసీఆర్ మోసం చేయని వర్గమే తెలంగాణలో లేదని ఆమె విమర్శించారు.