* రెజ్ న్యూస్ చెప్పింది నిజమే!
* విచారణలో తేలిన వాస్తవం..
* బిల్డాక్స్ పై జరిమానా ఎప్పుడు విధిస్తారు?
ఎట్టకేలకు రెజ్ న్యూస్ ప్రచురించిన కథనం నిజమేనని రుజువైంది. హఫీజ్పేట్ సర్వే నెంబర్ 80లో బిల్డాక్స్ సంస్థ.. ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయిస్తున్న విషయాన్ని ప్రప్రథమంగా రెజ్ న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొండాపూర్లోని మై హోమ్ మంగళకు ఎదురుగా ఉన్న వివాదాస్పద భూమిలో బిల్డాక్స్ సంస్థ ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయిస్తోందని మొట్టమొదటిసారిగా రెజ్ న్యూస్ ప్రచురించింది. దాన్ని ఆధారంగా టీఎస్ రెరా బిల్డాక్స్కు నోటీసుని ఇవ్వగా సంస్థ పెద్దగా స్పందించలేదు. ఇటీవల కాలంలో రెండో నోటీసును మళ్లీ జారీ చేసింది. దీంతో, బిల్డాక్స్ ప్రతినిధులు బుధవారం, గురువారం విచారణ నిమిత్తం హాజరయ్యారు. తాము ప్రీలాంచ్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని బిల్డాక్స్ ప్రతినిధి విచారణలో పేర్కొన్నారు. అయితే, ప్రీలాంచులో తాము కొనుగోలు చేసినట్లు కొందరు కొనుగోలదారుల నుంచి రశీదులను ఉన్నాయని టీఎస్ రెరా తేల్చి చెప్పింది. భువి, వాసవి బిల్డాక్స్ పేరిట గుండ్లపోచంపల్లిలో రెరా అనుమతి ఉంది తప్ప.. హపీజ్పేట్ సర్వే నెంబర్ 80లో లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో రెరా అనుమతి లేని బిల్డాక్స్ ప్రాజెక్టులో కొనుగోలుదారులెవరూ కొనకూడదని ఆదేశించింది.
* టీఎస్ రెరా చేయాల్సిన పని ఏమిటంటే.. బిల్డాక్స్ లో సభ్యులెవరో తెలుసుకోవాలి.. వారికి గతంలో నిర్మాణాలు చేపట్టిన అనుభవం ఉందా అనే అంశాన్ని కనుక్కోవాలి. ఇప్పటివరకూ బిల్డాక్స్లో ఎన్ని ఫ్లాట్లను విక్రయించారు? బయ్యర్ల నుంచి ఎంత మొత్తంలో ప్రజల్నుంచి సొమ్ము చేశారు? తదితర విషయాల్ని ఆరా తీయాలి. ఇప్పటివరకూ వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇచ్చేయాలి.