తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూసేకరణ చేయాల్సి వచ్చినప్పుడు.. అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో.. అధిక శాతం సొమ్మును పరిహారంగా చెల్లించడం ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో భూసేకరణ ప్రక్రియను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు.. టీడీఆర్ విధానాన్ని ప్రోత్సహించాలనే చర్చ జరిగిందని సమాచారం.
ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మరియు హెచ్ఎండీఏ కమిషనర్లు కలిసి.. టీడీఆర్‌లకు డిమాండ్ పెంచేందుకు దృష్టి సారించాలని ప్రభుత్వానికి విన్నవించారని సమాచారం. ఇందుకు సంబంధించి అతిత్వరలో ఉత్తర్వ్యులు వెలువడే అవకాశముందని తెలిసింది.
This website uses cookies.