గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ లో హైదరాబాద్ అదరగొట్టనుంది. ఈ ఏడాది చివరి నాటికి 17 మిలియన్ చదరపు అడుగుల మేర కొత్త స్పేస్ అందుబాటులోకి రానుంది. ఏ సంవత్సరంలోనైనా ఇంత మొత్తంలో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ రావడం ఇదే తొలిసారి. కాగా, గతేడాది ఆఫీస్ స్పేస్ సరఫరాలో 58 శాతం వాటాతో గచ్చిబౌలి టాప్ లో నిలిచింది. ఈ మేరకు వివరాలను క్రెడాయ్ హైదరాబాద్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో గ్రేడ్-ఎ ఆఫీస్ స్పేస్ లో 13 మిలియన్ చదరపు అడుగుల డిమాండ్ ఉండగా.. 12.4 మిలియన్ చదరపు అడుగుల మేర సరఫరా ఉంది. ప్రస్తుతం 151.1 మిలియన్ చదరపు అడుగుల మేర గ్రేడ్-ఎ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది.
2023 క్యూ4తో పోలిస్తే.. 2024 క్యూ4లో గ్రేడ్-ఎ ఆఫీస్ స్పేస్ ఖాళీలు 1.5 శాతం మేర తగ్గినట్టు నివేదిక వెల్లడించింది. అలాగే 2023 క్యూ4తో పోలిస్తే.. 2024 క్యూ4లో లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ స్పేస్ కలిగిన లావాదేవీలు 2.2 రెట్లు పెరిగాయి. అలాగే 2024 క్యూ4లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 14.7 శాతం పెరిగింది. ఐటీ, ఐటీఈఎస్ నుంచి డిమాండ్ 49 శాతం ఉండగా.. హెల్త్ కేర్ 18 శాతం, బీఎఫ్ఎస్ఐ 10 శాతం, ఆటోమొబైల్స్ 8 శాతం, కో వర్కింగ్ 4 శాతం, కమర్షియల్, ప్రొఫెషనల్ సర్వీసెస్ 4 శాతంతో ఉన్నాయి.
This website uses cookies.