హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల సంఖ్య పెరిగింది. స్థలాల ధరలు పెరిగిన నేపథ్యంలో.. నలభై నుంచి అరవై అంతస్తుల్ని నిర్మించే బిల్డర్లు అధికమయ్యారు. మరి, ఇంత ఎత్తులో నిర్మించే స్కై స్క్రేపర్లలో ఎలాంటి లిఫ్టులను వినియోగిస్తారో తెలుసా?
కోకాపేట్‌లో సాస్ ఇన్‌ఫ్రా సంస్థ.. జి + 57 అంతస్తుల ఎత్తులో సాస్ క్రౌన్ అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. మరి, కింది నుంచి అంత ఎత్తుకెళ్లడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? అక్షరాలా 30 సెకండ్లు. ఔను, మీరు చదివింది నిజమే. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 57 అంతస్తుల ఎత్తుకెళ్లేందుకు పట్టే సమయం.. కేవలం ముప్పయ్ అంటే ముప్పయ్ సెకండ్లే. ఇలాంటి హైస్పీడ్ లిఫ్టులను జపాన్ కు చెందిన మిట్సుబిషీ సంస్థ నుంచి కొనుగోలు చేసింది సాస్ ఇన్‌ఫ్రా. స్వయంగా ఆ సంస్థ ఎండీ హైదరాబాద్‌కు విచ్చేసి.. సాస్ క్రౌన్ ప్రాజెక్టును చూశాకే.. లిఫ్టులను ఖరారు చేశారని తెలిసింది. జి ప్లస్ 57 అంతస్తుల ఎత్తులో కట్టే సాస్ క్రౌన్‌లో.. ప్రతి టవర్‌కు నాలుగు హైస్పీడ్ లిఫ్టులుంటాయి. లిఫ్టుల కోసం వెయిటింగ్ పీరియడ్ మహా అయితే 15 నుంచి 20 సెకన్లు మాత్రమే ఉంటుందట. మొత్తానికి, నగరానికి చెందిన ఆకాశహర్మ్యంలో ఇంత స్పీడుగా వెళ్లే లిఫ్టులు ఏర్పాటు కావడం ఇదే ప్రప్రథమం.