poulomi avante poulomi avante

సొంతింటికి ఫార్మూలా ఇదే!

సొంతిల్లు కావాలనేది ప్రతి ఒక్కరి కల. ఆర్ధిక పరిస్థితిని బట్టి ఎప్పుడో ఒకప్పుడు.. ఎక్కడో ఒక చోట.. తమ తమ బడ్జెట్ కు అనుగునంగా ఓ ఇళ్లు కొనుక్కోవాలని అందరూ భావిస్తుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుకు తోడు బ్యాంకు రుణం తీసుకుని ఇళ్లు కట్టుకోవడమో, కొనుక్కోవడమో చేస్తుంటారు చాలా మంది.

అయితే సొంతింటి కోసం మనం పెట్టే ప్రతి పైసా చాలా ముఖ్యమైనదే. సరైన సమయంలో, సరైన ప్రాంతంలో, సరైన ధరకు ఇళ్లు కొనుక్కోవడం అంత ఆశామాషీ వ్యవహారం కాదు. అందుకే ఇంటి కొనుగోలు సమయంలో ఆర్ధిక, రియల్ రంగ నిపుణుల సలహాలు, సూచనలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసే ఇంటి విషయంలో చాలా జాగ్రత్త అవసరం అని ప్రత్యేక్యంగా చెప్పాల్సిన పనిలేదు.

సొంతిల్లు కొనుగోలు చేసే సమయంలో అతి ముఖ్యమైన 10 సూత్రాలను పాటించాలని సూచిస్తున్నారు రియల్ రంగ నిపుణులు. అందులో ప్రధానమైనది మనం కొనాలనుకుంటున్న ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా భవిష్యత్తులో సదరు ప్రాంతం ఎంతమేర అభివృద్ది చెందుతుంది, రానున్న రోజుల్లో వచ్చే మౌళిక సదుపాయాలేంటీ, విద్య, వైద్య, రవాణా సౌకర్యాలెలా ఉన్నాయన్నదానిపై అవగాహనకు రావాలి.

ALSO READ: అపార్ట్ మెంట్ లోనా.. ఫ్లాటా లేక విల్లానా?

ఇక మనం కొనాలనుకుంటున్న ఇంటికి సంబంధించిన డెవలపర్ గత చరిత్ర, సదరు బిల్డర్ పూర్తి ప్రొఫైల్ తెలుసుకోవాలి. గతంలో ఆ డెవలపర్ పూర్తి చేసిన ప్రాజెక్టులను పరిశీలించి, అవసరమైతే అందులోని కస్టమర్లతో మాట్లాడి ఓ అవగాహనకు రావాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అప్పటికే నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల్లో ఏవైనా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయా అన్నది విచారించాలి.

మనం కొంటున్న ఇంటికి సంబంధించిన ప్రాజెక్టులో రానున్న రోజుల్లో ధరలు ఎంతమేర వృద్ధి చెందుతాయన్నదానిపై ఓ అంచనాకు రావాలి. ఒకవేల ఇంటికి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణంలో ఉంటే సదరు బిల్డరు సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేస్తాడా అన్నదానితో పాటు బిల్డర్ ఆర్ధిక సామర్ధ్యంపై ఓ అంచనాకు రావాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్డర్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాడా అన్నది విచారించాలి. ఇక యదావిధిగా నిర్మాణ అనుమతులకు సంబంధించి హెచ్ఎండీఎ, రెరా తో పాటు ఇతర వివరాలు బౌతికంగా తనిఖీ చేయాలి. మనం కొనే ఇంటి ప్రాజెక్టుపై బిల్డరు ఏమైనా రుణాలు తీసుకున్నాడా, లేదంటే పాత లోన్స్ కు సంబందించి రీపేమెంట్ వంటి వివరాలపై ఆరా తీయాలి.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles