Gurgaon Trump Tower: Sold Out on Day 1
లాంచింగ్ చేసిన రోజే రూ.3,250 కోట్ల అమ్మకాలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు చెందిన కంపెనీ ట్రంప్ టవర్స్ పేరుతో గుర్గావ్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టు అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. లాంచింగ్ చేసిన రోజే మొత్తం యూనిట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్, ట్రిబెకా డెవలపర్స్ ట్రంప్ ఆర్గనైజేషన్ తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టు తొలి రోజే అన్ని యూనిట్లూ అమ్ముడైపోయి రూ.3,250 కోట్ల మేర కేటాయింపులు పూర్తి చేసింది. ఒక్కోటి రూ.125 కోట్ల విలువైన నాలుగు అల్ట్రా ప్రీమియం పెంట్ హౌస్ లు కూడా అమ్ముడైపోయినట్టు స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్ తెలిపింది. గుర్గావ్ లో ఇది రెండో ట్రంప్ ప్రాజెక్టు కాగా, భారత్ లో ఆరో ప్రాజెక్టు.
న్యూయార్క్ వెలుపల రెండు ట్రంప్ ప్రాజెక్టులు కలిగి ఉన్న ఏకైక నగరం గుర్గావ్ కావడం విశేషం. సెక్టార్ 69లో ఉన్న ట్రంప్ రెసిడెన్సెస్‌లో 51 అంతస్తుల్లో రెండు టవర్లలో మొత్తం 298 లగ్జరీ నివాసాలు ఉన్నాయి. ఇవి 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఒక్కో యూనిట్ కు రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్ల మధ్యలో ధర నిర్ణయించారు.
ప్రాజెక్టు అభివృద్ధి, నిర్మాణం, కస్టమర్ సర్వీసు ను Smart World Developers స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్ చూస్తుంది. డిజైన్, మార్కెటింగ్, అమ్మకాలు, క్వాలిటీ కంట్రోల్ ను ట్రిబెకా డెవలపర్స్ పర్యవేక్షిస్తుంది. ఢిల్లీలో 2018లో ప్రారంభించిన ట్రంప్ టవర్స్ దేశంలో మొదటిది. ఇది కూడా పూర్తిగా అమ్ముడైపోగా, ఈ నెల చివరిలో డెలివరీ చేయనున్నారు.
This website uses cookies.