Categories: TOP STORIES

లీజింగ్ లో హైటెక్ సిటీ టాప్

గ్రేడ్ ఏ ఆఫీస్ లీజింగ్ లో హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతం తన ఆధిపత్యం నిలబెట్టుకుంది. 2023 తొలి త్రైమాసికంలో మొత్తం లీజింగ్ లో 76 శాతం వాటా హైటెక్ సిటీదే కావడం విశేషం. ఇక 2023 క్యూ1లో కొత్త ఆఫీస్ సరఫరా 2 మిలియన్ చదరపు అడుగుల వద్ద స్థిరంగా ఉంది.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీలో ముందుగా చేసుకున్న కమిట్ మెంట్లతో అక్కడ కొత్త సరఫరా ఎక్కువగా వచ్చింది. ఇది రాబోయే త్రైమాసికాల్లో మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున ఆఫీస్ స్పేస్ ఖాళీలుగా భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ఆఫీస్ ఔట్ లుక్ పై కొలియర్స్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. హైదరాబాద్ కు సంబంధించి వివరాలివీ..

  • 2023 తొలి త్రైమాసికం నాటికి 91.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్టాక్ ఉంది
  • క్యూ2లో 2.9 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ రానుంది. ఇందులో 8 శాతం వాణిజ్యం వాటా కాగా, మిగిలిన 92 శాతం ఐటీదే.
  • ఇక ఆఫీస్ అద్దెల విషయానికి వస్తే.. నెలకు చదరపు అడుగుకు రూ.35.9 నుంచి రూ.77.7 వరకు ఉంది.

పాన్ ఇండియాలో గ్రేడ్ ఏ ఆఫీస్ మార్కెట్ ను చూస్తే.. 2023 క్యూ1లో 667.2 మిలియన్ చదరపు అడుగుల స్టాక్ ఉండగా.. 16.4 శాతం ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంది. సగటు అద్దె నెలకు చదరపు అడుగుకు రూ.95.1గా ఉంది. దేశవ్యాప్తంగా 2023 క్యూ1లో లీజింగ్ వాటాలను పరిశీలిస్తే..

 

బెంగళూరు 32 శాతంతో తొలి స్ధానంలో ఉంది. తర్వాత ఢిల్లీ (22 శాతం), చెన్నై (15 శాతం), హైదరాబాద్ (13 శాతం), ముంబై (10 శాతం), పుణె (8 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదే కొత్త సరఫరా వివరాలను చూస్తే.. బెంగళూరు 42 శాతం వాటాతో తొలి స్థానంలో ఉండగా.. 25 శాతం వాటాతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ (13 శాతం) చెన్నై (9 శాతం), పుణె (7 శాతం), ముంబై (4 శాతం) తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి.

This website uses cookies.