Categories: TOP STORIES

ప్ర‌పంచ దేశాలు రియాల్టీని ఎలా ప్రోత్స‌హిస్తున్నాయ్‌?

రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్ డెవలప్మెంట్‌కి వివిధ దేశాలు ఎలాంటి విధానాల్ని అనుస‌రిస్తున్నాయో తెలుసా? మ‌న దేశం కూడా ఇలాంటి వినూత్న నిర్ణ‌యాలు తీసుకుంటేనే.. రియ‌ల్ రంగం వృద్ధి చెందుతుంది. ప్ర‌జ‌లు సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకుంటారు. మ‌రి, ప‌లు దేశాలు ఏయే ప‌థ‌కాల్ని ప్రారంభించాయంటే..

ఆస్ట్రేలియాలో 2000 సంవత్సరంలో ఫస్ట్‌ హోమ్‌ ఓనర్‌ గ్రాంట్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు తొలిసారి ఇల్లు కొనేవారికి వన్‌టైమ్‌ గ్రాంట్‌ సదుపాయం కల్పించారు. ఈ స్కీమ్‌ వల్ల కొత్త ఇంటి నిర్మాణాలు ఊపందుకోవడంతో పాటు హౌసింగ్‌ ప్రైసెస్‌లోనూ పెరుగుదల కనిపించింది.
2013లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో హెల్ప్‌ టు బై స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో డిపాజిట్లు తగ్గించి ఈక్విటీలోన్‌ పెంచారు. దీంతో మొదటిసారి ఇల్లు కొనే వారి సంఖ్య అపరిమితంగా పెరిగింది.
2014లో ఫ్రాన్స్‌లో పీనల్‌ లా పథకాన్ని ప్రవేశపెట్టారు. రెంటల్‌ ప్రాపర్టీల్లో పన్ను రాయితీలను కల్పించడంతో రెసిడెన్షియల్‌ రెంటల్‌ మార్కెట్‌ రంగంలో మంచి మార్పు కనిపించింది.

2017లో అమెరికాలో ఆపర్చూనిటీ జోన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థికంగా వెసులుబాటులేని ప్రాంతాల్లోని రియల్‌ ఎస్టేట్‌తో పాటు.. మౌలిక సదుపాయాల కల్పనా రంగంలో పన్ను రాయితీలను కల్పించారు. ఈ పాలసీ అమలు చేసిన ప్రాంతాల్లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉండటం, ఉద్యోగాలు పెరగడం లాంటి చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయ్‌.

2017లో కెన‌డా.. నేషనల్‌ హౌసింగ్‌ స్ట్రాటజీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది కెనడా. అఫ‌ర్డబుల్ హౌస్‌లను పెంచడం, సొంతిల్లు లేని వారి సంఖ్యని తగ్గించేందుకు వీలుగా పదేళ్ల కాలవ్యవధితో 40 బిలియన్‌ అమెరికన్ డాలర్లతో ఈ పాలసీని తీసుకురాగా.. నిరాశ్రయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
2017లో సౌదీ అరేబియా.. సకిని పేరుతో ప్రోగ్రామ్‌ని ప్రవేశపెట్టింది. అల్ప మధ్య ఆదాయ వర్గాల వారికి గృహ వసతి కోసం రాయితీలు.. లోన్లు కల్పించడంతో రియల్ ఎస్టేట్‌.. కన్‌స్ట్రక్షన్‌ సెక్టార్స్‌ గణనీయంగా అభివృద్ధి చెందాయ్‌.
2019లో గోల్డెన్‌ వీసా ఫర్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్టర్స్‌ స్కీమ్‌ను ఆఫర్‌ చేసింది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌. విదేశీ పెట్టుబడిదారుల్ని ఆహ్వానించేందుకు లాంగ్‌ టర్మ్‌ రెసిడెన్సీ సదుపాయం కల్పించడం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ విస్తరణ.. ఆర్థిక వైవిధ్యం లాంటివి UAEని ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ లోకేషన్‌గా మార్చేశాయ్‌.

This website uses cookies.