భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారం ఉండాలి.. ప్లాటుకు మంచి రేటు రావాలి.. ఓ ఐదు, పదేళ్లయినా ఫర్వాలేదు.. నివాసముండేలా కాలనీ ఏర్పడాలి.. ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉండేలా పరిసరాలుండాలి.. ఇలాంటి అంశాల్ని ప్లాటు కొనేముందు పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉందని భావిస్తేనే వీరు అడుగు ముందుకేస్తారు. మరి, ఈ లేఅవుట్లను ఎంత విస్క్తీర్ణంలో డెవలప్ చేస్తారు? అందులో రేటెంత చెబుతున్నారు?
హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో ప్లాట్ల రేట్లు కొండెక్కాయి. అక్కడ కొనాలంటే ఎక్కువ రేటు పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా, భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశమున్న ప్రాంతాల్లో ప్లాట్ల కోసం ఎంతవరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది? తతెలంగాణ ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు కు సమీపంలోని వివిధ ప్రాంతాల్లో రేటెంత చెబుతున్నారంటే..