హైదరాబాద్ లోని మణికొండ, కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, పొప్పాల్ గూడ, షేక్ పేట్, టోలీచౌకి, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో 12 నుంచి 18 శాతం మేర ఇంటి అద్దెలు పెరిగాయి. చందానగర్ లో డబుల్ బెడ్ రూం ఇంటి అద్దె మొన్నటి వరకూ.. 18 వేలు ఉండగా ఇప్పుడు 22 వేలకు చేరింది.
టోలిచౌకీలో డబుల్ బెడ్ రూం ఇంటి అద్దే 20 వేల నుంచి 24 వేలకు, మణికొండలో రెండు పడకల ఇంటి అద్దె 22 వేల నుంచి 26 వేలకు పెరిగింది. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో కనీసం డబుల్ బెడ్ రూం హౌజ్ రెంట్ 28 వేల రూపాయలుగా ఉంది. ఇక దేశంలోని మిగతా నగరాలైన ముంబైలో 18 శాతం, చెన్నైలో 14శాతం, బెంగళూరులో 13 శాతం మేర ఇంటి అద్దెలు పెరిగాయి.
This website uses cookies.