Categories: TOP STORIES

మోకిలా వేలం మోసమేనా?

  • కృత్రిమంగా పెంచేసిన గజం ధ‌ర‌
  • కొంద‌రు రియ‌ల్ట‌ర్లు, ఏజెంట్ల మాయ‌
  • వాళ్లు ప‌లికిన రేటును తొల‌గించాలి
  • ఆ ధ‌ర‌ను ప్రామాణికంగా తీసుకోవ‌ద్దు!

హెచ్ఎండీఏ మోకిలాలో నిర్వ‌హించిన వేలం పాట‌లో పాల్గొన్న స్థానిక రియ‌ల్ట‌ర్లు, ఏజెంట్లు కృత్రిమంగా ధ‌ర‌ల్ని పెంచార‌నే విష‌యం మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. ఎందుకంటే, ఇక్క‌డ ప్లాట్ల‌ను కొనుగోలు చేసిన సామాన్య మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌ల‌కు బ్యాంకు రుణాలు మంజూరు కాక‌పోవ‌డ‌మో ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని హెచ్ఎండీఏ అధికారికంగా చెబుతోంది. అయితే, కోకాపేట్ వేలంలో పాల్గొన్న బిడ్డ‌ర్ల‌కు పిలిచి మ‌రీ రుణాల్ని మంజూరు చేసిన బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు.. మోకిలాలో ప్లాట్లు కొన్న‌వారికి ఎందుకు మంజూరు చేయ‌వ‌నే సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వేలంలో ప్లాట్ల‌ను ద‌క్కించుకున్న చాలామందికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవ‌స‌ర‌మే పెద్ద‌గా ఉండ‌దు. కాక‌పోతే, బిడ్డ‌ర్లు కృత్రిమంగా ధ‌ర‌ల్ని పెంచేందుకే ఈ వేలంలో పాల్గొన్నార‌నే విష‌యం తెలిసిందే.

హెచ్ఎండీఏ నిర్వ‌హించిన వేలం పాట‌ల కంటే ముందు.. ఇక్క‌డ గజం ధర ప్రాంతాన్ని బట్టి ముప్ప‌య్ నుంచి న‌ల‌భై వేలు ఉండేది. అయిన‌ప్ప‌టికీ, అంతంత రేటు పెట్టి ఫ్లాట్ల‌ను కొన‌డానికి ప్ర‌జ‌లు ముందుకొచ్చేవారు కాదు. దీంతో, ఈ ప్రాంతానికి హైప్ తేవ‌డానికి కొంద‌రు రియ‌ల్ట‌ర్లు, ఏజెంట్లు హెచ్ఎండీఏ వేలం పాట‌ల్ని వాడుకున్నార‌ని తెలిసింది. వీరంతా క‌లిసి గ‌జం ధ‌ర రూ. ల‌క్ష వ‌ర‌కూ పెంచేశారు. ఈ విష‌యం అర్థ‌మ‌య్యాక హెచ్ఎండీఏ.. ఆయ బిడ్డ‌ర్లు వేలంలో పాడిన పాట‌ల్ని తొల‌గించాలి. ఆయా ధ‌ర‌నూ తీసివేసి.. ఆత‌ర్వాత ప‌లికిన రేటును ప్రామాణికంగా తీసుకుని ప‌త్రికాముఖంగా ప్ర‌జ‌లందరికీ తెలియ‌జేయాలి. కేవ‌లం మోకిలాలోనే కాదు.. ఇత‌ర ప్రాంతాల్లోని లేఅవుట్ల‌లోనే ఇదే ప‌ద్ధ‌తిని అనుస‌రించాలి.

This website uses cookies.