స్నేహితుడి కుమార్తె వివాహానికి హాజరు కావడం కోసం వారం రోజుల పాటు నేపాల్ వెళ్లి రావడానికి అనుమతించాలంటూ మంత్రి రియల్టీ లిమిటెడ్ మాజీ చైర్మన్ సునీల్ మంత్రి పెట్టుకున్న అభ్యర్థనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. దేశం విడిచి వెళ్లడానికి అనుమతిస్తే.. రుణదాతలకు ఎలాంటి భరోసా ఉండదని.. అందువల్ల నేపాల్ వెళ్లడానికి అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రుణదాతలకు సునీల్ మంత్రి రూ.300 కోట్ల మేర బకాయిలు పడ్డారు.
వాటిని చెల్లించడంలో విఫలమైనందుకు మంత్రి సంస్థలు లిక్విడేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితుడి కుమార్తె వివాహానికి హాజరు కావడం కోసం నేపాల్ వెళ్లాల్సి ఉందని, అందుకు అనుమతించాలని ఆయన అభ్యర్థించారు. అయితే, ఈ కేసులో కీలక సూత్రధారి సునీల్ మంత్రి అయినందున, ఆయనకు దేశం విడిచి వెళ్లడానికి అనుమతిస్తే.. రుణదాతలు ఆందోళన చెందుతారని, ఆయన తిరిగి వస్తారో లేదో అనే అనుమానం తలెత్తుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల సునీల్ మంత్రి నేపాల్ పర్యటనకు అనుమతించలేమని స్పష్టం చేసింది.
This website uses cookies.