దేశీయ నిర్మాణ దిగ్గజమైన మై హోమ్ గ్రూప్.. కోకాపేట్లోని నియోపోలిస్లో.. మైహోమ్ నిషధ ప్రాజెక్టును ఆరంభించింది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును దాదాపు 16.68 ఎకరాల్లో డెవ‌ల‌ప్ చేస్తున్నారు. జి ప్లస్ 44 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న నిషధలో.. మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. సుమారు 1398. ఫ్లాట్ల విస్తీర్ణం.. 3450 నుంచి 4617 చదరపు అడుగుల్లో ఉంటాయి. ఎనభై శాతం ఓపెన్ స్పేస్ ఉండే నిషధలో క్లబ్ హౌజ్ ను లక్షకు పైగా చదరపు అడుగుల్లో అభివృద్ధి చేస్తారు. డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీతో ఎనిమిది స్కై హై టవర్లను సంస్థ డిజైన్ చేసింది.

మై హోమ్ నిషధ ప్రాజెక్టు ఎలివేషన్లను ఈసారి వైవిధ్యంగా తీర్చిదిద్దారు. చూపరుల్ని ఆకట్టుకునే రీతిలో ఉండేలా డిజైన్ చేశారు. ఆకాశహర్మ్యంలో నివసించేవారి భద్రత నిమిత్తం ప్రత్యేకంగా.. ప్రతి టవర్లలో కొన్ని ఫ్లోర్లలో రెఫ్యూజీ ఏరియాలను ఏర్పాటు చేశారు. ఉదాహరణకు టవర్ 2 మరియు 7 విషయానికి వస్తే.. 17, 26, 35 మరియు 44 అంతస్తుల్లో ఇలా స్థలాన్ని కేటాయించారు. శునకాలను అమితంగా ప్రేమించేవారి కోసం ప్రత్యేకంగా పెట్ జోన్ ఏర్పాటు చేస్తారు. సైకిళ్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్, స్కేటింగ్ రింక్, సైకిల్ ట్రెయిల్, మల్టీపర్పస్ ప్లే కోర్ట్ వంటివి అమర్చారు. ఎంట్రెన్స్ లాబీ, క్లబ్ హౌస్, ఓపెన్ ఎమినిటీస్ వంటివి డబుల్ హైట్ లో నిర్మిస్తారు. ఇలా, ప్రతి అంశాన్ని పక్కాగా ఆలోచించి.. మై హోమ్ నిషధను సంస్థ డిజైన్ చేసింది.

మైహోమ్ 99..

మై హోమ్ గ్రావా ఐటీ హ‌బ్ ప‌క్క‌నే.. దాదాపు 1.74 ఎక‌రాల్లో.. నైరుతి దిశ‌లో ఉస్మాన్ సాగ‌ర్‌ను వీక్షిస్తూ.. ఆనంద‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని కోరుకునే వారికోస‌మే కోకాపేట్‌లో… మై హోమ్ 99 రూపుదిద్దుకుంటోంది. 9299, 10,399 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ల‌ను డిజైన్ చేశారు. సుమారు జి+53 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తోంది. కొన్ని త‌రాల ప్ర‌జ‌లు జీవించాలి కాబ‌ట్టి.. అందుకు అనుగుణంగా స‌రిపోయేలా.. ఆక‌ర్ష‌ణీయంగా డిజైన్ చేశారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌తి సంద‌ర్భాన్ని ఆస్వాదించ‌డానికి 14 అడుగుల సిట‌వుట్ ఏరియాను.. బెడ్‌రూమ్ బాల్క‌నీల‌ను విశాలంగా క‌నిపించేందుకు ఆరు అడుగుల్లో అభివృద్ధి చేశారు. నాలుగు అంత‌స్తుల్లో క్ల‌బ్ హౌజ్‌ను డిజైన్ చేశారు. ఇందులోని ఇన్‌ఫినిటీ పూల్ ప్ర‌తిఒక్క‌రికీ విశేషంగా న‌చ్చుతుంది.

మై హోమ్ అపాస్

కోకాపేట్‌లో మై హోమ్ సంస్థ అపాస్ ప్రాజెక్టును 13.85 ఎకరాల్లో నిర్మిస్తోంది. ఇందులో వ‌చ్చేవి ఆరు స్కై హై ట‌వ‌ర్లు. మొత్తం వ‌చ్చేవి 1335 యూనిట్లు. ఇందులో 2765 నుంచి 3860 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ల‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. జి ప్ల‌స్ 44 అంత‌స్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో నిర్మాణ ప‌నులూ జోరుగా జ‌రుగుతున్నాయి. ఇందులోని క్ల‌బ్ హౌజ్‌ను దాదాపు 72 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో అభివృద్ధి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here