- టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్
- ల్యాంకోహిల్స్ చేరువలో
- ఆర్కాలో అమ్మకాలు అదుర్స్
హైదరాబాద్ రియాల్టీలో అమ్మకాలు జరగట్లేదని.. మార్కెట్ మొత్తం ఢమాల్ అయిపోయిందని.. కొందరు పనిగట్టుకుని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఫ్లాట్లను ఎవరూ కొనుగోలు చేయట్లేదని.. విల్లాల వైపు కన్నెత్తి చూడట్లేదనేది వాస్తవం కాదు. హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుకునేవారిలో అధిక శాతం మంది.. నేటికీ సొంతిల్లు కొంటున్నారు. రైట్ ప్రాడక్ట్.. రైట్ మిక్స్ విత్ రైట్ బిల్డర్ అయితే అమ్మకాలకు ఢోకా ఉండదని టీమ్ ఫో లైఫ్ స్పేసెస్ నిరూపించింది. కేవలం రెండంటే రెండే రోజుల్లో.. 129 ఫ్లాట్లను విక్రయించి.. సరికొత్త రికార్డును సృష్టించింది.
టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్ ఖాజాగూడ దాటిన తర్వాత వచ్చే ల్యాంకోహిల్స్ చేరువలో.. ఆర్కా అనే ప్రాజెక్టును 43 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తోంది. ఇందులో మొత్తం వచ్చేవి ఆరు టవర్లు కాగా.. ప్రతి అంతస్తుకూ నాలుగైదు యూనిట్లు వస్తాయి. 2120 నుంచి 4410 చదరపు అడుగుల్లో ఫ్లాట్ సైజుల్ని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. ఇటీవల మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్స్ మీట్‌లో.. రెండు రోజుల్లో.. దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని విక్రయించింది. అలాగనీ, ఇందులో ఫ్లాట్ ధర తక్కువేం కాదు. ఆరంభ ఫ్లాట్ ధర సుమారు రెండున్నర కోట్లు కాగా గరిష్ఠంగా నాలుగు కోట్ల దాకా ఉంటుంది.
రైట్ ప్రాడక్ట్ ఎట్ రైట్ ప్లేస్
హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు.. మార్కెట్లో సరైన ప్రాజెక్టు కోసం వెతుకుతారు. అన్నివిధాల నప్పే ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు. స్ట్రాటజిక్ లొకేషన్‌లో.. ఆకర్షణీయమైన ఎమినిటీఎస్, అబ్బురపరిచే ఫెసిలిటీస్, తివాచీపర్చిన పచ్చదనం, స్టన్నింగ్ ఎలివేషన్సన్.. మైండ్ బ్లోయింగ్ స్పెసికేషన్లతో.. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు ఆరంభమైందంటే.. ఆటోమెటిగ్గా దానిపై దృష్టి సారిస్తారు. ఆ ప్రాజెక్టును టైమ్లీ డెలివరి చేసే బిల్డర్ నిర్మిస్తుంటే.. బయ్యర్లు మరో ఆలోచన లేకుండా అందులో ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. ఇదే విషయాన్ని నిరూపించింది నగరానికి చెందిన టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్.