దేశంలో రియల్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) అభిప్రాయపడింది. అందుబాటు ఇళ్ల నిర్మాణానికి నిధుల ప్రవాహం పెచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని నరెడ్కో చైర్మన్ హీరానందని పేర్కొన్నారు. అలాగే హౌసింగ్ లోన్ వడ్డీ చెల్లింపుపై తగ్గింపును రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సంప్రదాయ ప్రీ-బడ్జెట్ సమావేశానికి హాజరైన తర్వాత.. ఆయన విలేకరులతో మాట్లాడారు. అందుబాటు ధరలో గృహనిర్మాణ రంగానికి నిధుల ప్రవాహాన్ని పెంచడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
‘ప్రస్తుతం గృహ రుణాలలో ఆదాయపన్ను చట్టం కింద రూ.2 లక్షల వరకు మినహాయింపు ఇస్తున్నారు. ఇది చాలా తక్కువ. దీనిని కనీసం రూ.5 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. 40 ఏళ్లకు పైగా ఉన్న తన కెరీర్‌లో అందుబాటు ధరల ఇళ్ల వృద్ధి ప్రతికూలంగా ఉన్న మొదటి సంవత్సరం ఇదేనని చెప్పారు. ఈ నేపథ్యంలో అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై దృష్టి పెట్టడం ఓ మార్గమని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రితో జరిగిన సమావేశంలో ఇళ్ల కొనుగోలుపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కు సంబంధించిన అంశాలపై కూడా చర్చించినట్లు హీరానందానీ తెలిపారు.
మూలధన లాభాల విషయంలో నేను ఒక ఇంటిని విక్రయించి, రెండు గృహాలను కొనుగోలు చేస్తే, అది మూలధన లాభాలపై పన్ను మినహాయింపు. అయితే, నాకు ముగ్గురు పిల్లలు మరియు నేను మూడు ఇళ్ళు కొనాలనుకుంటే, మూలధన లాభం కోసం మినహాయింపు లేదు” అని వివరించారు. కొత్త ఇల్లు కొనే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కు సంబంధించిన లొసుగులను పరిష్కరించాలని ఆర్థిక మంత్రికి సూచించినట్లు చెప్పారు.
This website uses cookies.