బాలీవుడ్ నటుడు వరణ్ ధావన్ ముంబైలో రెండు లగ్జరీ అపార్ట్ మెంట్లు కొనుగోలు చేశారు. జుహూ ప్రాంతంలో ట్వంటీ పేరుతో నిర్మాణంలో ఉన్న ఓ ప్రాజెక్టులో రూ.86.92 కోట్లకు రెండు ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. వరుణ్ ధావన్ తన భార్య నటాషా ధావన్‌తో కలిసి 7వ అంతస్తులో ఓ ఫ్లాట్ ను రూ.44.52 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఇండెక్స్ టాప్ డాట్ కామ్ వెల్లడించింది. 5,112 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఈ ఫ్లాట్ నాలుగు కార్ పార్కింగ్ స్థలాలతో వస్తుంది.
ఈ అపార్ట్ మెంట్ ధర చదరపు అడుగుకు రూ.87వేలకు పైనే పడింది. అలాగే వరణ్ తన తల్లి కరుణా ధావన్‌తో కలిసి అదే భవనంలోని 6వ అంతస్తులో రూ.42.40 కోట్లతో రెండో లగ్జరీ ఫ్లాట్ కొన్నారు. ఈ అపార్ట్ మెంట్ 4,617 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనికి కూడా నాలుగు కార్ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. జనవరి 3న ఈ రెండు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
ముంబైలోని జుహూలో డి డెకర్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన ప్రాజెక్టులోని ఈ రెండు అపార్ట్ మెంట్లు కలిసి 9,730 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. రెండింటికీ కలిపి రూ.రూ.86.92 కోట్లు వెచ్చించారు. కాగా, ధావన్ ఇటీవలే కలీస్ చిత్రం బేబీ జాన్‌లో కీర్తి సురేష్, జాకీ ష్రాఫ్, వామికా గబ్బితో కలిసి కనిపించారు. ఆయన రాబోయే చిత్రం సన్నీ సంస్కారీ కి తులసి కుమారిలో జాన్వీ కపూర్‌తో కలిసి నటించనున్నారు.
This website uses cookies.