poulomi avante poulomi avante

న‌వ బిల్డ‌ర్లు.. న‌యా త‌ల‌నొప్పులు 

  • బిల్డ‌ర్లుగా అవ‌తార‌మెత్తిన క‌న్స‌ల్టెంట్లు
  • సేల్స్‌, మార్కెటింగ్ మ‌ధ్య తేడా తెలియ‌ని ప‌రిస్థితి
  • రెరా అనుమ‌తితో వేరే ప్రాజెక్టు అమ్మ‌కాలు
  • శంక‌ర్‌ప‌ల్లి, బాచుప‌ల్లిలో ఈ వినూత్న‌ దందా

అత‌నో యువ బిల్డ‌ర్‌. నిన్నా మొన్న‌టివ‌ర‌కూ క‌న్స‌ల్టెంట్‌గా కొన్ని ప్లాట్లు విక్ర‌యించాడు. మార్కెట్ స‌హ‌క‌రించ‌డంతో మంచి లాభాల్ని గ‌డించాడు. కొంద‌రిని పెట్టుబ‌డిదారుల్ని ప‌ట్టుకుని.. కొంత కాలం క్రితం ఎంచ‌క్కా బిల్డ‌ర్‌గా అవ‌తార‌మెత్తాడు. బాచుప‌ల్లి, శంక‌ర్‌ప‌ల్లిలో కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించాడు. రెరా అనుమ‌తి తీసుకుని కొన్ని.. తీసుకోకుండా మ‌రిన్ని మార్కెట్లో అమ్మ‌కానికి పెట్టాడు. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ఈ వ్య‌క్తి ఐటీ ఉద్యోగం వ‌ద‌లుకుని రియ‌ల్ రంగంలోకి ప్ర‌వేశించాడ‌ని స‌మాచారం. అంతా బాగానే ఉంది కానీ, నిర్మాణ రంగానికి సంబంధించిన కొన్ని ప్రాథ‌మిక విష‌యాలు ఇత‌నికి తెలియ‌ద‌ని స‌మాచారం. ఇలాంటి కొత్త బిల్డ‌ర్లే హైద‌రాబాద్ నిర్మాణ రంగానికి లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చే అవ‌కాశ‌ముంది.

మార్కెట్లో బూమ్ ఉన్న‌ప్పుడు ఎలాంటి ప్లాట్లు అయినా ఫ్లాట్లు అయినా ఇట్టే అమ్ముడౌతాయి. కానీ, మార్కెట్ మెరుగ్గా లేక‌పోతే ఒక్క‌సారిగా ప‌రిస్థితి త‌ల‌కిందులౌతుంది. ఈ విష‌యం అనుభ‌వ‌జ్ఞులైన డెవ‌ల‌ప‌ర్ల‌కు తెలుసు. కానీ, కొత్త‌వాళ్లకు ఇవ‌న్నీ తెలియ‌దు. ఎప్పుడూ మార్కెట్ మెరుగ్గానే ఉంటుంద‌ని భ్ర‌మ‌లో ఉంటారు. రెరా అనుమ‌తి తీసుకోకుండానే విక్రయాలు మొద‌లు పెడ‌తారు. సేల్స్‌, మార్కెటింగ్‌కు తేడా తెలియ‌క ఇష్టం వ‌చ్చిన‌ట్లు  ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని స‌మాచారం. లీడ్స్ ఎలా జ‌న‌రేట్ చేయాలో తెలియ‌దు. ఇంకా పాత ప‌ద్ధ‌తిలోనే ప‌రుగు పెడుతున్నాడు. అమ్మ‌కాల్లో కొత్త టెక్నిక్ తెలియ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ ఇబ్బందులు ఎదురౌతున్నాయ‌ని స‌మాచారం.

పాపం.. ఈ న‌వ డెవ‌ల‌ప‌ర్‌.. ప్లాట్లు అమ్మిన‌ట్లుగానే ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తార‌ని అపోహ‌ప‌డుతున్నారు. అందుకే, మేనేజ‌ర్ స్థాయి వ్య‌క్తుల్ని ప్ర‌భుత్వ కార్యాలయాల‌ వ‌ద్ద నిల్చోపెట్టి ఫ్లాట్ల‌ను అమ్మే ప‌నిని అప్ప‌గించార‌ని తెలిసింది. దీంతో, ఈ సంస్థ‌లో ప‌ని చేసే సిబ్బంది తెగ ఇబ్బంది ప‌డుతున్నార‌ని స‌మాచారం. ముందేమో చెప్పిందొక్క‌టి.. ఇప్పుడు చేస్తుందొక్క‌ట‌ని అంటున్నారు. సేల్స్‌, మార్కెటింగ్‌, నిర్మాణ ప‌నులు.. ఇలా ప్ర‌తి అంశంలో ఇలాంటి వారి వ్య‌వ‌హార‌శైలి వ‌ల్ల నిర్మాణ రంగం దారుణంగా దెబ్బ‌తినే ప్ర‌మాద‌ముంది. ఎప్పుడే ప‌ని చేయాలో అర్థం కాక‌. తెలియ‌క‌పోయినా,, తెలుసుకునే ప్రయ‌త్నం చేయ‌డం లేదు. త‌మ‌కంతా తెలుసు అనే భ్ర‌మ‌లో ఉన్న న‌వ డెవ‌ల‌ప‌ర్ల‌కు సీనియ‌ర్లు మెంటార్లుగా వ్య‌వ‌హ‌రించి.. దిశానిర్దేశం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles