Categories: TOP STORIES

పీఈ పెట్టుబడులు పెరిగాయ్

  • 6 శాతం పెరుగుదలతో 2.82 బిలియన్ డాలర్లకు చేరిక

దేశ రియల్ రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు పెరిగాయి. ఏప్రిల్‌-డిసెంబర్‌లో 6 శాతం పెరుగుదలతో 2.82 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇండస్ట్రియల్‌, లాజిస్టిక్స్‌ పార్కులు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించాయి. 2023-24లోని ఇదే కాలంలో 2.66 బిలియన్‌ డాలర్ల పీఈ పెట్టుబడులు లభించాయి. అయితే గతేడాది 24 లావాదేవీలు జరగ్గా.. 2023లో 30 లావాదేవీలు నమోదయ్యాయి.

మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ నిధుల వాటా 82 శాతం కాగా.. దేశీయంగా 18 శాతం పెట్టుబడులు వచ్చాయి. ఇండస్ట్రియల్‌, లాజిస్టిక్స్‌ విభాగం అత్యధికంగా 62 శాతం పెట్టుబడులను సమకూర్చుకుంది. అలాగే హౌసింగ్‌ 15 శాతం, ఆఫీస్‌ విభాగం 14 శాతం, మిక్స్ డ్ వినియోగ ప్రాజెక్టులు 9 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. తొలి 9 నెలల మొత్తం పీఈ లావాదేవీలలో టాప్‌-10 డీల్స్‌ వాటా 93 శాతమని అనరాక్‌ క్యాపిటల్‌ సీఈవో శోభిత్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

This website uses cookies.