గతేడాది హైదరాబాద్ లో భారీగా భూ లావాదేవీలు జరిగాయి. ఇందులో పెద్ద డీల్స్ నాలుగు ఉన్నాయి. 2024లో దేశవ్యాప్తంగా 2515 ఎకరాలకు సంబంధించి 133 లావాదేవీలు జరగ్గా.. హైదరాబాద్ లో 67 ఎకరాలకు సంబంధించి నాలుగు లావాదేవీలు నమోదయ్యాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ కంపెనీ రూ.267 కోట్లతో 48 ఎకరాలు కొనుగోలు చేసిన భూ లావాదేవీయే పెద్దది. అయితే, ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ కాస్త వెనకబడి ఉంది.
ముంబైలో అత్యధికంగా 607 ఎకరాలకు సంబంధించి 30 లావాదేవీలు జరగ్గా.. ఢిల్లీలో 417 ఎకరాలకు సంబంధించి 38 డీల్స్ జరిగాయి. బెంగళూరులో 307 ఎకరాలకు సంబంధించి 26 ఒప్పందాలు జరగ్గా.. చెన్నైలో 69 ఎకరాలకు సంబంధఇంచి 7 లావాదేవీలు నమోదయ్యాయి. పుణెలో 63 ఎకరాలకు సంబంధించి 8 లావాదేవీలు జరగ్గా.. కోల్ కతాలో 53 ఎకరాలకు సంబంధించి ఒకే లావాదేవీ నమోదైంది. కాగా, దేశవ్యాప్తంగా 2023లో 2707 ఎకరాలకు సంబంధించి 97 లావాదేవీలు నమోదయ్యాయి.
This website uses cookies.