poulomi avante poulomi avante

జ‌న‌ప్రియ‌మైన ప్రాజెక్టులు

Credai Hyderabad Property Show 2022 Special

జనప్రియ.. జనాలకు ప్రియమైనది. అతి తక్కువ ధరకే ఫ్లాట్లను అందించాలన్న ల‌క్ష్య‌మే.. ఈ సంస్థను జ‌నాలకు చేరువ చేసింది. చేతిలో ప‌ది వేలు ఉన్న‌వారికీ హైద‌రాబాద్‌లో త‌ల‌దాచుకునేందుకు గూడును క‌ల్పించిన‌ ఏకైక సంస్థ‌.. జ‌న‌ప్రియ‌. త‌క్కువ రేటులో ఫ్లాట్ల‌ను నిర్విరామంగా అంద‌జేసిన ఖ్యాతి సంస్థ ఛైర్మ‌న్ కే.ర‌వీంద‌ర్ రెడ్డికే ద‌క్కుతుంది. 1985 నుంచి అంటే 36 ఏళ్ల నుంచి సుమారు 26 వేల‌మందికి పైగా సొంతింటి క‌ల‌ను ఆయ‌న సాకారం చేశారు. మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా, నిర్మాణ రంగంలో స‌రికొత్త ప‌రిజ్ఞాన్ని అందిపుచ్చుకుని.. ప్ర‌స్తుతం అనేక ప్రాజెక్టుల్ని చేప‌డుతోంది.

‘జనప్రియ’ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే.. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్ని ఎంచుకుంటుంది. అందులో కొన్నవారు ఆ తర్వాత పెరిగే ఇంటి విలువను చూసి ఎంతో సంతోషిస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, మియాపూర్లో కేవలం లక్ష రూపాయలకే ఫ్లాటు అందించిన ఘనత జనప్రియకే దక్కుతుంది. అది కూడా కేవలం పది వేలు కడితే చాలు.. మిగతా సొమ్మును రుణం ఇప్పిచ్చేవారు. ఆ తర్వాతక్రమంలో ఇంటి విలువ దాదాపు పది నుంచి పదిహేను లక్షలైంది. అంటే, చేతిలో నుంచి పెట్టింది పది వేలే అని గుర్తుంచుకోండి.

ఇస్నాపూర్ ఎందుకు?

జ‌న‌ప్రియ సంస్థ ఇస్నాపూర్‌లో ఉన్న‌తి అనే ప్రాజెక్టును సుమారు నాలుగు ఎక‌రాల్లో చేప‌ట్టింది. ఇందులో వ‌చ్చే మూడు ట‌వ‌ర్ల‌లో 670 ఫ్లాట్ల‌ను క‌డుతోంది. 1, 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ల‌కు పెద్ద‌పీట వేసింది. జూన్ 2023లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధి బీరంగూడ తర్వాత ముత్తంగి ఓఆర్ఆర్ వరకూ విస్తరించింది. అక్కడ్నుంచి నగరానికి రోజు రాకపోకల్ని సాగించేందుకు ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంది. ఇస్నాపూర్ చేరువలోనే స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు, ఆస్పత్రులు వంటివి ఉన్నాయి. ముంబై హైవే రోడ్డుకు పక్కన ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుకు నాలుగు నిమిషాల్లో చేరుకోవచ్చు. పదిహేను నిమిషాల్లో పటాన్ చెరు బస్ డిపో, అరగంటలో లింగంపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్లొచ్చు. ఇలాంటి సానుకూలాంశాల్ని గ‌మ‌నించి.. ఇస్నాపూర్‌లో ఉన్న‌తి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

స్విమ్మింగ్ పూల్

రేటు తక్కువ అని జనప్రియ సంస్థ ఆధునిక సదుపాయాల్ని అందజేసే విషయంలో రాజీ పడటం లేదు. లగ్జరీ ప్రాజెక్టుల్లో ఉన్నట్టుగానే ఇందులో ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. జిమ్ ఏర్పాటు చేస్తోంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు, ల్యాండ్ స్కేప్డ్ గార్డెన్స్, కమ్యూనిటీ హాల్ వంటి సౌకర్యాల్ని కల్పిస్తోంది. ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే.. 2 బీహెచ్కే కోసం సుమారు రూ.30.58 లక్షలు పెడితే సరిపోతుంది.

మ‌దీనాగూడ‌లో నైల్ వ్యాలీ

జ‌న‌ప్రియ చేపడుతోన్న మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టే.. జ‌నప్రియ నైల్ వ్యాలీ. సుమారు 25 ఎక‌రాల్లో ప‌ది ట‌వ‌ర్ల‌ను నిర్మిస్తోంది. ఇందులో వ‌చ్చే మొత్తం ఫ్లాట్ల‌.. 2400 దాకా ఉంటాయి. ఇందులో వ‌చ్చేవి 2,3 ప‌డ‌క గ‌దుల ఫ్లాట్లే కావ‌డం గ‌మ‌నార్హం. 2బి బ్లాకుని 2023లో, 6వ బ్లాకుని 2025 జూన్‌లో కొనుగోలుదారుల‌కు అప్ప‌గిస్తామ‌ని సంస్థ చెబుతోంది. ఇందులో డబుల్ బెడ్రూం ఫ్లాట్ సైజు 970 చదరపు అడుగుల నుంచి ఆరంభమవుతుంది. గరిష్ఠంగా ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్లు 1615 చదరపు అడుగుల విస్తీర్ణం వరకూ ఉంటాయి. ధర విషయానికి వస్తే.. రూ.60.58 లక్షల్నుంచి ఆరంభమవుతుంది. అభివృద్ధి చెందిన  మదీనాగూడ వంటి ప్రాంతంలో ఇంత తక్కువ రేటుకు ఫ్లాట్లను అందించే సంస్థ మరోటి లేదని గుర్తుంచుకోండి.

ఇప్పటికే పూర్తయిన కొన్ని టవర్లలో హోమ్ బయ్యర్లు నివసిస్తున్నారు. ప్రతి బుధవారం రైతుబజార్ కూడా ఏర్పాటు అవుతుంది. కార్పొరేట్ పాఠశాలల బస్సులు నైల్ వ్యాలీకి వస్తాయి. ఒరాకిల్, టీసీఎస్, గూగుల్, డెలాయిట్ వంటి సంస్థల్లో పని చేసే అనేక మంది ఐటీ ఉద్యోగులు ఇందులో నివసిస్తున్నారు. జిమ్, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మీంటన్, ఇతర ఇండోర్ గేమ్స్ వంటివి ఉన్నాయి.

జ‌న‌ప్రియ @ వై జంక్ష‌న్‌

ప్రముఖ డెవలపర్ వైట్ వాటర్స్ సహకారంతో, జనప్రియ కూకట్‌పల్లి ‘వై’ జంక్షన్‌లో ఉన్న జనప్రియ @ వై జంక్షన్ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ స్థ‌లానికి ల్యాండ్ లార్డ్ గా జనప్రియ వ్యవహరిస్తోంది. ఇది హై ఎండ్ లగ్జరీ ప్రాజెక్టు కావ‌డం గ‌మ‌నార్హం. ఏడు ఎక‌రాల విస్తీర్ణంలో గ‌ల‌ ఈ ప్రాజెక్టులో  1575 నుంచి 2105 చ‌ద‌ర‌పు అడుగుల దాకా ఫ్లాట్ల‌ను నిర్మిస్తారు. సుమారు ప‌దిహేను అంత‌స్తుల్లో ట‌వ‌ర్ల‌ను నిర్మిస్తారు.  కూక‌ట్ ప‌ల్లి వై జంక్ష‌న్ వ‌ద్ద గ‌ల బాలాన‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ ప‌క్క‌నే ఈ ప్రాజెక్టు ఉంది. అందుకే, ఇందులో ఫ్లాట్లు అత్యంత వేగంగా అమ్ముడ‌వుతున్నాయి.

జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ ఎయిర్ కండిషన్డ్ స్క్వాష్ కోర్ట్, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, బాస్కెట్‌బాల్ కోర్ట్, పిల్లలు & పెద్దల స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, మెడిటేషన్‌, యోగా రూమ్. గ్రీన్ డెక్స్ @ ఏరోబిక్స్ స్పేస్, బిజినెస్ హాల్, బ్యాంక్ బోర్డ్ రూమ్‌లు, క్రెష్‌, అతిథి గదులు, హోమ్ థియేటర్, లైబ్రరీ వంటి ఆధునిక స‌దుపాయాల‌న్నీ పొందుప‌రుస్తారు.

ఎంతెంత దూరం?

ఇక్క‌డ్నుంచి జెనెసిస్ స్కూల్ కి 3నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. జేఎన్‌టీయూ, డీఏవీ పబ్లిక్ స్కూల్ 8 నిమిషాలు, సంఘమిత్ర పాఠశాల 12 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు.
ఆస్ప‌త్రుల విష‌యానికి వ‌స్తే.. ఓమ్నీ ఆస్ప‌త్రి మూడు నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. యశోద హాస్పిటల్ 15 నిమిషాలు, కిమ్స్ హాస్పిటల్ 20 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు.
షాపింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. కోర్ ఏరియా కావ‌డంతో చెన్నై షాపింగ్ మాల్ @ వై జంక్షన్ మూడు నిమిషాలు, కేపీహెచ్‌బీ షాపింగ్ హ‌బ్ 6 నిమిషాలు, ఐకియాకు 20 నిమిషాల్లో వెళ్లొచ్చు.

సైనిక్‌పురిలో..

జ‌న‌ప్రియ సంస్థ సైనిక్‌పురిలో ఆరంభించిన ప్రాజెక్టే లేక్ ఫ్రంట్‌. దాదాపు 5.83 ఎక‌రాల్లో 5 ట‌వ‌ర్ల‌లో 920 ఫ్లాట్ల‌ను నిర్మిస్తోంది. ఇందులో వ‌చ్చేవ‌న్నీ 2, 3 ప‌డ‌క గదుల ఫ్లాట్లే. 2022 డిసెంబ‌రు నుంచి కొనుగోలుదారుల‌కు అప్ప‌గిస్తామ‌ని సంస్థ చెబుతోంది. ఫ్లాట్ల విస్తీర్ణం.. 810 నుంచి 1200 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో డిజైన్ చేశారు. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. సుమారు రూ.40.14 ల‌క్ష‌ల నుంచి ఆరంభ‌మ‌వుతుంది. సైనిక్‌పురి, ఎ.ఎస్. రావు నగర్ వంటి ప్రాంతాలు ఎంతో ప్ర‌శాంత‌మైన‌వి. ఇక్క‌డ్నుంచి సూపర్ మార్కెట్లు, ఆసుపత్రులు, కళాశాలలు, రెస్టారెంట్లు, కమ్యూనిటీ పార్కులు మరియు అన్ని ముఖ్యమైన ప్రాంతాల‌కు క‌నెక్టివిటీ ఉంది. గాలి మరియు శబ్ద కాలుష్యం లేకుండా, సైనిక్‌పురి యొక్క నిర్మలమైన వాతావరణం రిలాక్స్‌డ్ లైఫ్‌స్టైల్ & రిటైర్మెంట్ కోసం ఖచ్చితంగా సరిపోతుందని చెప్పొచ్చు.

రెడీ టు మూవ్.. సితార!

జనప్రియ సంస్థ సైనిక్ పురిలోనే సితార అనే ప్రాజెక్టును ఆరున్నర ఎకరాల్లో కడుతోంది. ఇందులో 1, 2 పడక గదుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. మొత్తం ఫ్లాట్ల సంఖ్య.. సుమారు 1326. ఫ్లాట్లను 580 నుంచి 865 చదరపు అడుగుల్లో డిజైన్ చేశారు. ధర విషయానికి వస్తే.. సుమారు రూ.29.56 లక్షల్నుంచి ఆరంభమవుతుంది. ప్రస్తుతం కొనుగోలుదారులకు బ్లాక్- ఏ1 ఫ్లాట్లను హ్యాండోవర్ చేస్తోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles