జంటనగరాలు, శివారు ప్రాంతాల డవలపర్స్, బిల్డర్లు, చిన్న, పెద్ద రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి కోరిక మేరకు మరోసారి “ఉప్పల్ భగాయత్ ప్రిబిడ్ మీటింగ్” నిర్వహించాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటగంట వరకు బేగంపేట్ లోని “టూరిజం ప్లాజా”లో హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న ప్రి బిడ్ మీటింగ్ కి డెవలపర్లు, వారి ప్రతినిధులు, ప్లాట్లు కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారు అందరూ హాజరు కావాలని హెచ్ఎండిఏ అధికారులు కోరారు.
వివిధ కేటగిరిలకు సంబందించిన 44 ప్లాట్లు ఉప్పల్ భగాయత్ వెంచర్ లో అందుబాటులో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో 150 గజాల స్థలం నుంచి 5వేలకు పైగా గజాల స్థలాలు ఉప్పల్ భగాయత్ వెంచర్ లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టిసి ఆధ్వర్యంలోడిసెంబర్ 2, 3 తేదీల్లో ఈ- అక్షన్ జరుగనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు, వారి ప్రతినిధులు ప్రిబిడ్ సమావేశానికి హాజరుకావాలని హెచ్ఎండిఏ పిలుపునిచ్చింది.