ఒకప్పుడు ప్లాట్లను కొనుగోలు చేయడానికి అధిక శాతం మంది కొనుగోలుదారులు శివారు ప్రాంతాలకు వెళ్లేవారు. గత ప్రభుత్వం పుణ్యమా అంటూ శివార్లలో ప్లాట్ల రేట్లకు రెక్కలు రావడంతో.. ప్రస్తుతం కొనుగోలుదారులు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో ప్లాట్లను కొంటున్నారు. అయితే, ట్రిపుల్ ఆర్ భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. ప్రస్తుతం కొంత కదలికలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు సంస్థలు గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లను డెవలప్ చేస్తున్నాయి. టీఎస్ రెరా అనుమతి గల ఇలాంటి వెంచర్లలో పెట్టుబడి పెడితే.. భవిష్యత్తులో అప్రిసియేషన్ అయ్యేందుకు ఆస్కారముంది. ప్రణవ గ్రూప్ షామీర్‌పేట్‌లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్లను 7.16 ఎకరాల్లో డెవలప్ చేస్తోంది. హండ్రెడ్ పర్సంట్ వాస్తుసూత్రాలకు అనుగుణంగా ఈ వెంచర్‌లో అధిక శాతం ప్లాట్లన్నీ అమ్ముడయ్యాయి. అదేవిధంగా, మేడ్చల్ హైవేలోని కలక్కల్ మెయిన్ రోడ్డు వద్ద చూడముచ్చటైన వెంచర్‌ని అవని ప్లాట్స్ డెవలప్ చేసింది.
This website uses cookies.